అపర కుబేరుడు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) చిన్న కుమారుడు అనంత్ అంబానీ( Ananth Ambani ) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ( Pre Wedding Celebration ) మూడు రోజులపాటు జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా అక్కడికి చేరుకొని మూడు రోజులపాటు ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లి వేడుకలలో ఎక్కువగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi kapoor ) సందడి చేశారు.పెళ్లి మొత్తం ఈమెదే అన్నట్టు ఎక్కడ చూసినా తలుక్కుమంటూ మెరిసారు.
ఇలా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి.
జాన్వీ కపూర్ ప్రస్తుతం భారీ స్థాయిలో నేటిజన్లు చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది.ఇందులో రాధిక మర్చంట్ పెళ్లి కూతురుగా ముస్తాబయ్య నడుస్తూ ఉండగా పక్కనే కొందరు ఆమెపై పువ్వులు చల్లుతూ ఉండగా మరికొందరు హారతులు పడుతూ నిల్చున్నారు.
ఈ క్రమంలోనే నటి జాన్వీ కపూర్ కూడా ఏకంగా హారతి పళ్లెం పట్టుకొని రాధిక మర్చంట్ నడుస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఆమె తనకు హారతి ఇస్తారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై ఎంతోమంది నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు.డబ్బు ఎంతటి పని అయినా చేయిస్తుంది అంటూ కామెంట్లు చేయగా డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేయడానికి నువ్వు సిద్ధమేనా జాన్వీ అంటూ మరికొందరు ఈమె వ్యవహార శైలిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె ఇటీవల వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ముఖ్యంగా తెలుగులో ఈమె స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు.ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి దేవర సినిమాలో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఈమె షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయిందని సమాచారం ఇలా ఎన్టీఆర్ సరసన మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ నటించే అవకాశం అందుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం అనంత్ అంబానీ పెళ్లి విషయంలో వార్తలలో నిలిచారు.