అతిలోక సుందరి, దివంగత నటి అయిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జాన్వీ ఒకవైపు కెరిర్ పరంగా బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను,ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
మొదట ఈమె దడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
ఇలా ఉంటే తాజాగా ఒక బ్యూటీ ఫిలిం ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాల గురించి పంచుకుంది.అలాగే ఆ ఇంటర్వ్యూ ఆమె తోబుట్టువులు అయిన అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా జాన్వికపూర్ మాట్లాడుతూ అమ్మ చనిపోయిన తర్వాత అన్నయ్య అర్జున్, అన్షులా మా జీవితాల్లో కి వచ్చారు.

అర్జున్ కపూర్ ,అన్షులా కపూర్ బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకి పుట్టిన పిల్లలు అన్న విషయం తెలిసిందే.వారు వచ్చిన తరువాత మేము మరింత ధైర్యంగా సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలిగింది.మాకు మరొక ఇద్దరు తోబుట్టువులు దొరికారు అని ఎవరైనా చెబుతారు లేదో తెలియదు కానీ మేము అయితే చాలా అదృష్టవంతులం ఇంతకన్నా గొప్పగా మాకు ఏం లభించ లేదు అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
అనంతరం తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.నిజాయితీగా నాన్న తో ఇలా కొత్తగా ఉంది.
మా నాన్న మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.మేము నలుగురు కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు అని తెలిపింది జాన్వికపూర్.







