తల్లి కాబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. నెట్టింట ఫొటోస్ వైరల్?

నటి విదిషా శ్రీవాస్తవ( Actress Vidisha Srivastava ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తెలుగుతోపాటు కన్నడం తమిళం మలయాళం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Janatha Garage Fame Vidisha Srivastava Announces Pregnancy , Vidisha Srivastava,-TeluguStop.com

కాగా భాభిజీ ఘర్ పర్ హైన్( Bhabhiji ghar par hain ) సీరియల్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది విదిషా శ్రీవాస్తవ.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె గర్భం ధరించినట్లు వెల్లడించింది.

త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి జూలైలో తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా విదిషా టాలీవుడ్‌ తో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది.మా ఇద్దరి మధ్య అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ.ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, దేవరాయ సినిమాలలో నటించింది.ఓకే ఏడాదిలో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదల అయ్యాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హిట్ మూవీ జనతా గ్యారేజ్‌ సినిమాలో విదిషా శ్రీవాస్తవ కీలకపాత్రలో కనిపించింది.

ఈ చిత్రంలో రియా పాత్రలో మెప్పించింది.

ఇకపోతే విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్‌లో సాయక్ పాల్‌ను వివాహం చేసుకున్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయికి వెళ్లనున్నట్లు తెలిపింది.కాగా తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అలాగే పలువురు సెలబ్రెటీలు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube