ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన ,బిజెపి ల హవా కనిపిస్తోంది.భారీ మెజారిటీతో కూటమి అధికారం చేపట్టే దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
ఊహించని స్థాయిలో వైసిపి ఘోర పరాజయం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అనేక జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసే దిగా ఫలితాలు వెలువడుతున్నాయి.
కూటమి పార్టీలైన టిడిపి, జనసేన ,బిజెపిల అంచనాలకు మించి విజయం దిశగా దూసుకు వెళ్తున్నాయి.ఈ ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలు కూడా తలకిందులు అయ్యాయనే చెప్పవచ్చు .ఈ ఎన్నికల్లో వైసిపి పరాజయం స్పష్టంగా కనిపిస్తోంది.అయితే ఈ తరహా ఎన్నికల ఫలితాలు రావడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
![Telugu Ap, Chandrababu, India, Janasena-Politics Telugu Ap, Chandrababu, India, Janasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/06/elections-election-commission-of-India-TDP-janasena-BJP-chandrababu-janasena-party-YCP-ap-politics.jpg)
2019 ఎన్నికల్లో వైసీపీ( YCP)కి జనాలు ఇచ్చిన తీర్పు తరహాలోనే ఇప్పుడు టిడిపి కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.ఈ ఎన్నికల్లో కూటమి గెలుపులో జనసేన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో గెలుపు దిశగా దూసుకు వెళ్తోంది.అదే కనుక జరిగితే ఇది నిజంగా ఏపీ రాజకీయాల్లో కొత్త రికార్డే.2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడిస్తానని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శపదం చేశారు.ఆ విధంగానే ఇప్పుడు జగన్ ను ఓడించే విషయంలో పవన్ పార్టీ కీలక పాత్ర పోషించింది.
పిఠాపురం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలిచే విధంగా రౌండ్ల వారీగా ఫలితాలు వెలువడతున్నాయి.జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిస్తే పవన్ ప్రభావం మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు.
![Telugu Ap, Chandrababu, India, Janasena-Politics Telugu Ap, Chandrababu, India, Janasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/06/election-commission-of-India-TDP-janasena-BJP-chandrababu-janasena-party-YCP-ap-politics.jpg)
జనసేన పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ గెలిచే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.ఏపీలో ఏర్పాటయిన కొత్త ప్రభుత్వంలోనూ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామ్యం కాబోతోంది. పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.అదే జరిగితే రానున్న రోజుల్లో జనసేన క్షేత్ర స్థాయి లో మరింతగా బలోపేతం అవుతుంది అనడంలో సందేహమే లేదు.