ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం ల పొత్తు క్షేత్రస్థాయిలో కీలక దశకు ప్రవేశించింది.ముఖ్యంగా ఈ రెండు పార్టీల సంయుక్త సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం.
ఎన్నికల లక్ష్యంగా పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ ను తయారు చేసుకోవడం కోసం ఈ రెండు పార్టీల కీలక నేతలు వరుస సమావేశాలు అవుతుండడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా ఎన్నికల నగారా మోగినట్లే భావించాలి.అయితే పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఈ రెండు పార్టీలు ఉమ్మడిగానే ప్రకటించబోతున్నాయంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నవంబర్ ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మేనిఫెస్టోను ఈ రెండు పార్టీలు ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే గత కొంత కాలం క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ( Telugudesam party ) తనదైన మినీ మేనిఫెస్టోలను రూపొందించుకొని హామీలను ప్రకటించింది.భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు ( Chandrababu )అనేక వర్గాలను ఆకట్టుకునే లా కొన్ని ప్రత్యేకమైన హామీలను ప్రకటించారు.విజయదశమి వేదికగా పూర్తిస్థాయి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే ఊహించని పరిణామాలతో తెలుగుదేశం పార్టీ కుదేలవడంతో ఇప్పుడు ఆ పార్టీ ప్లాన్ మార్చుకున్నట్లుగా తెలుస్తుంది.

జనసేనతో తెలుగుదేశం పొత్తు ఇప్పుడు ఆ పార్టీకి ఆక్సిజన్ గా మారడంతో ఇప్పుడు ఎన్నికల కేంద్రంగా జరిపే అన్ని కార్యక్రమాలలోనూ జనసేనను భాగస్వామిగా చేసుకుంటుంది .ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ఉమ్మడి భాగస్వామిగా జనసేనను( Jana Sena ) చేర్చడం ద్వారా అధికారంలో భాగస్వామిని చేసుకుంటున్నామన్న పరోక్ష సంకేతాలను తెలుగుదేశం పార్టీ ఇస్తున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు.దూకుడైన రాజకీయాలు చేస్తున్న జనసేన పక్కన ఉంటే అది క్షేత్రస్థాయిలో పార్టీకి బూస్టింగా ఉంటుందని భావిస్తున్న టిడిపి ఇక జనసేన ( TDP Janasena )ను పూర్తిస్థాయి పార్టనర్ గా గుర్తించినట్లే ఉంది.
మరి క్షేత్రస్థాయిలో ఆ స్థాయి సమన్వయం ఈ రెండు పార్టీల కార్య కర్తలలో కనిపించకపోయినా అగ్రస్థాయి నాయకత్వం మాత్రం పూర్తిస్థాయి అవగాహనతోనే ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి ఒక్కసారి సీట్ల సర్దుబాట్ల ను అధికారం లో వాటాలను కూడా తేల్చేసుకుంటే ఇక పొత్తు పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కుతుంది అని చెప్పవచ్చు .