Janasena Suryachandra : రబ్బరు చెప్పులు వేసుకునే సామాన్యుడు టికెట్ ఆశించకూడదేమో.. జనసేన ఇన్ ఛార్జ్ ఎమోషనల్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ( Janasena Party ) 24 స్థానాలలో పోటీ చేయడం విషయంలో జన సైనికుల నుంచి కొంతమేర అసంతృప్తి వ్యక్తమవుతోంది.మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే జనసేనకు ప్లస్ అయ్యేదని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు భావిస్తున్నారు.

 Janasena Suryachandra Emotional Comments Goes Viral In Social Media Details Her-TeluguStop.com

గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాల్లోనే జనసేన ఎక్కువగా పోటీ చేయనుందని తెలుస్తోంది.ఇప్పటికే జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా వెల్లడైంది.

పవన్ కళ్యాణ్ సైతం భీమవరం నుంచి పోటీ చేస్తారని ఇందులో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వచ్చేసింది.అయితే జనసేన నుంచి టికెట్ ఆశించిన కొంతమంది అభ్యర్థులు మాత్రం తీవ్రస్థాయిలో నిరాశకు గురవుతున్నారు.

జగ్గంపేట నియోజకవర్గం( Jaggampeta Constituency ) నుంచి టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ( Jyothula Nehru ) పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది.జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ గా పాటంశెట్టి సూర్యచంద్ర ఉన్నారు.

Telugu Janasena, Jyothula Nehru, Pawan Kalyan, Suryachandra-Politics

తనకు టికెట్ రాలేదని తెలిసిన వెంటనే సూర్యచంద్ర( Suryachandra ) ఎమోషనల్ అయ్యారు.గోనేడ నుంచి అచ్యుతాపురం వరకు పాదయాత్ర చేయడంతో పాటు రబ్బరు చెప్పులు వేసుకునే తనలాంటి సాధారణ, సామాన్య వ్యక్తి టికెట్ ఆశించడం రైట్ కాదేమో అని సూర్యచంద్ర కామెంట్లు చేశారు.సూర్యచంద్రకు టికెట్ దక్కకపోవడంతో స్థానికంగా జనసేన శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Janasena, Jyothula Nehru, Pawan Kalyan, Suryachandra-Politics

తనకు టికెట్ రాలేదనే బాధతో సూర్యచంద్ర బోరున విలపించారు.అయితే టికెట్ రాని పార్టీ కోసం కష్టపడిన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ నచ్చజెప్పడంతో పాటు భరోసా ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.జనసేన 2024 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.జనసేనకు సపోర్ట్ చేసే కొంతమంది ప్రముఖులు సైతం సీట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.13 శాతం అసెంబ్లీ సీట్లతో జనసేన రాజకీయాలలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube