నేనే రోడ్డెక్కుతా ! పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఎవరికంటే ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ అధికార పార్టీ వైసీపీ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

గత కొంతకాలంగా జనసేన నాయకులను టార్గెట్ చేసుకుని వైసిపి ప్రభుత్వం అనేక చర్యలకు దిగుతుండడం పై పవన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  విజయవాడ పశ్చిమ,  జగ్గయ్యపేట నియోజకవర్గల్లో జనసేన జెండా ఆవిష్కరణలకు వైకాపా వర్గాలు అడ్డుపడుతున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తెలుపుతోంది.జనసేన ఉనికి లేకుండా చేయడం ఎవరి తరము కాదు.

ప్రజలే పార్టీని కాపాడుకుంటారు.శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే ఇంత జరుగుతున్నా నేను రోడ్డు మీదకు రాలేదు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే నేనే రోడ్డెక్కుతా అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు.ఈ మేరకు ఆయన తన సందేశాన్ని వినిపించారు.

Advertisement

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని , దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ ప్రకటించారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన జెండా దిమ్మను  వైసిపి దౌర్జన్యకారులు జెసిబి తో కూల్చివేసిన ఘటనలో దోషులపై వెంటనే కేసు నమోదు చేయకుండా, తిరిగి జనసేన నాయకుల పైనే కేసులు పెట్టారని,  ఇది ఎంతవరకు న్యాయం అంటూ పవన్ ప్రశ్నించారు.

జనసేన తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీసులు అడ్డుతగులుతూ అనుమతి లేదంటూ వ్యవహరించడం సరికాదని,  ఈ విధంగా వేధింపులకు దిగడం మంచి పరిణామం కాదు అంటూ పవన్ అన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకుల్లో ఉత్సాహం పెరిగిందని, ఇదే పరిస్థితిని ఎన్నికల వరకు తీసుకువెళ్తే తమకు తిరిగి ఉండదని ఆలోచనతో పవన్ ఉన్నారు.అందుకే ఏపీలో చోటు చేసుకున్న ప్రతి చిన్న పరిణామం పై పవన్ తో పాటు , ఆ పార్టీ కీలక నాయకులు స్పందిస్తున్నారు .ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేపడుతూ,  మీడియా , సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.త్వరలో పవన్ సైతం ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి తమ్ముడి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటున్న మహిళ.. వీడియో వైరల్‌
Advertisement

తాజా వార్తలు