వార్నింగ్ బెల్స్ పట్టించుకో పవన్ !

జనసేనలో చెప్పుకోవడానికి కీలక నేతలు వేళ్ళ మీద మాత్రమే లెక్కపెట్టగలిగినా ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం జనసేనకు బలంగానే ఉంది.

పది సంవత్సరాలుగా రాజకీయంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా కూడా జనసేన( Janasena ) కోసం తమ స్వలాభం కూడా పక్కన పెట్టుకొని పని చేసే నాయకులు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉంటారు.

వారు ఆయా ఎన్నికల సమయాలలో తమ వ్యక్తిగత పనులను పక్కనపెట్టి మరీ విదేశాల నుంచి జనసేన కోసం పనిచేయడం కోసం వస్తారు.అలాంటి నిబద్ధతగల కార్యకర్తలు ఉండటం జనసేన అదృష్టమైనా అటువంటి వారిని నిలుపుకోవడం జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కర్తవ్యం కూడా.

మరి ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు పవన్( Pawan Kalyan ) దృష్టికి రావడం లేదా? లేక వచ్చిన ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదా అన్నది తెలియదు కానీ, ఇటీవల కాలంలో వరుస పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు చేజారి పోతుండటం జనసేన మద్దతుదారులను ఆందోళన పరుస్తుంది.పైగా అలా వెళ్ళిపోతున్న వారందరూ జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ పై( Nadendla Manohar ) విమర్శలు ఎక్కుపేడుతూ ఉండటంతో పార్టీలో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

ముఖ్యంగా అక్కడ మహిళ నేత అయిన రుక్మిణి( Rukmini ) అనే మహిళా కీలక నేతగా ఉన్నారని ఆవిడ తో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకుల కు పొసగడం లేదన్నది వినిపిస్తున్న విమర్శల సారాంశం.పార్టీ కోసం కష్టపడిన తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సమన్వయ కమిటీలలో కానీ పార్టీ కార్య నిర్వహణ లో కానీ తమకు కీలక బాధ్యతలు అప్పజెప్పడం లేదని పార్టీ వీడిన వారు చేస్తున్న విమర్శ.

Advertisement

నాదెండ్ల తన అనుకూలమైన వ్యక్తులతో ఒక కోటరి నిర్మించుకున్నారని, పార్టీ నిర్వహణ అంతా ఆయా వ్యక్తుల చుట్టూనే తిరుగుతుందని అన్నది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ, మరి ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలకు జనసేన కు రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది,మరి పవన్ ఎప్పటికైనా సరైన చర్యలు తీసుకొని పరిస్థితులు చక్కదిద్దక పోతే మాత్రం జనసేన మూల్యం చెల్లించాల్సిన అవకాశం ఉందని భావిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు