రాధ ను ఇరికించిన పవన్ ! ఆ అభ్యంతరంపై కాపుల్లో చర్చ ?

నిన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన 10 వ ఆవిర్భావ సభలో( Janasena Formation Day ) ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ఆవేశంగానే మాట్లాడారు.అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.

 Janasena Pawan Kalyan Comments On Vangaveeti Ranga Marriage Details, Pawan Kalya-TeluguStop.com

పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగ అంశంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపు నాయకుడుగా పేరు తెచ్చుకున్న వంగవీటి రంగ( Vangaveeti Ranga ) విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్న కుమారుని పెళ్లి చేసుకోవడం ద్వారా,  తాను ఏ ఒక్క కులానికో,  మతానికో పరిమితమైన వాడిని కాదనే సందేశం ఇచ్చారని పవన్ అన్నారు.ఎప్పుడో దశాబ్దాల క్రితం వంగవీటి రంగాకు ప్రాణహాని ఉందని తెలిసినా.

ఇక్కడి కాపులు ఆయనను రక్షించుకోలేకపోయారని పవన్ అన్నారు.కాపు సామాజిక వర్గానికి చెందిన రంగ,  కమ్మ సామాజిక వర్గానికి చెందిన రత్నకుమారిని పెళ్లి చేసుకుంటే ఆయనకు గాని ,ఇప్పుడు ఆయన కుమారుడు రాధాకు కానీ ఎటువంటి అభ్యంతరాలు లేవని, రధానే ఈ విషయంలో మౌనంగా ఉంటున్నప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటని పవన్ కాపు యువతను ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా కమ్మ సామాజిక వర్గానికి తాము శత్రువులము కాదనే అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ,  జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయనే హడావుడి జరుగుతోంది.

అయితే ఈ విషయంలో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.

Telugu Kamma, Kapu, Pawan Kalyan, Tdp Janasena, Vangaveetiradha, Ysrcp-Politics

గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన టిడిపితో పొత్తు ఏ విధంగా పెట్టుకుంటారు అంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు.జనసేన వర్గాల్లోనూ టిడిపి పొత్తు అంశంపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.ఈ నేపద్యంలోనే పవన్ వ్యూహాత్మకంగా ఈ ప్రసంగం చేసినట్లుగా అర్థమవుతుంది.

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు( Vangaveeti Radhakrishna ) ఇబ్బందికరంగా మారాయి.  ప్రస్తుతం రాధా టీడీపీలో యాక్టివ్ అయ్యారు.ఆయన జనసేన లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, 

Telugu Kamma, Kapu, Pawan Kalyan, Tdp Janasena, Vangaveetiradha, Ysrcp-Politics

మొన్న చిత్తూరు జిల్లాలో లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వంగవీటి రంగ విగ్రహాలు ఎవరు ప్రతిష్టించినా.వాటి ప్రారంభోత్సవానికి రాధాకృష్ణ వెళ్తున్నారు.తన తండ్రి మాదిరిగానే బలమైన కాపు నాయకుడుగా ముద్ర వేసుకునేందుకు రాధా ప్రయత్నిస్తున్నారు.ఆయన వైసీపీ ప్రోత్బలంతోనే రాష్ట్రవ్యాప్తంగా రంగా విగ్రహాల ప్రారంభోత్సవాలకు వెళ్తున్నారని అనుమానాలు పవన్ లో కనిపిస్తున్నాయి.అందుకే రాధ దూకుడు కు బ్రేక్ వేసేందుకు , కమ్మలకు కాపులకు ఎటువంటి వైరం లేదనే విషయాన్ని చాటి చెప్పేందుకు పవన్ ఈ విధంగా రంగ కులాంతర వివాహాన్ని తెరపైకి తెచ్చినట్టు గా రాజకీయ వర్గాల్లో అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube