మంగళగిరిలో నారా లోకేష్ ని భయపెడుతున్న జనసేనాని

టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్, ఈ ఎన్నికలలో ఎలా అయిన గెలిచి తనని తాను నాయకుడుగా నిరూపించుకోవడంతో పాటు, భవిష్యత్తు టీడీపీ సారధిగా బాద్యతలు తీసుకోవడానికి కావాల్సిన అర్హతని సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.దానికోసం రాజధాని ప్రాంతం అయిన మంగళగిరి ని తన రాజకీయ పునాదులకి ఎంచుకున్నాడు.

 Janasena Party Stop The Nara Lokesh Victory-TeluguStop.com

ఇక మంగళగిరి స్థానం నుంచి తాను ఎలా అయిన విజయం సాధించాలనే ఆలోచనతో ఉన్న లోకేష్ కి టీడీపీ అధిష్టానం కూడా గట్టిగా సపోర్ట్ చేస్తుంది.

ఇక లోకేష్ గెలుపు కోసం అవసరం అయితే ఎన్ని కోట్లు అయిన ఖర్చు చేయడానికి సిద్ధంగా టీడీపీ పార్టీ ఉంది.

అయితే లోకేష్ కి మంగళగిరిలో గెలుపు అంత ఈజీ కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట, ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్ధిగా ప్రజలలో బలమైన నాయకుడుగా ముద్ర వేసుకున్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఉన్నాడు.ఇక అతనికి బలం తన వ్యక్తిత్వం, అలాగే ప్రజలతో కలిసిపోయే పద్ధతి, ఈ కారణంగా ఆళ్ళని మంగళగిరి ప్రజలు తమ వాడిగా భావిస్తారు.

అలాగే ఎలాంటి అవినీతి మచ్చ లేని నాయకుడుగా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఉన్నారు.

దీంతో వైసీపీ నుంచి లోకేష్ కి గట్టి పోటీ ఎదురవుతుంది.ఇదిలా ఉంటే మరో వైపు జనసేన పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంది.ప్రజారాజ్యం టైంలో మంగళగిరి స్థానంని తక్కువ ఓట్ల మెజారిటీతో రెండో స్థానంకి పరిమితం అయ్యింది.

అప్పుడు సిపిఎం, సిపిఐ పార్టీల అభ్యర్ధులు కూడా మంగళగిరి బరిలో ఉన్నారు.అయితే ఈ సారి పొత్తు కారణంగా మంగళగిరి స్థానం నుంచి జనసేన సపోర్ట్ తో సిపిఎం పోటీలో ఉంది.

దీంతో ప్రజారాజ్యం ఓటు బ్యాంకుతో పాటు ఇప్పుడు కమ్యూనిస్ట్ ల ఓటు బ్యాంకు కూడా తమకి లాభిస్తుందని జనసేన పార్టీ ఆశిస్తుంది.ఒక వేళ అలా కాకున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా లోకేష్ గెలుపుని మాత్రం జనసేన అడ్డుకుంటుంది అనేది అక్కడ వినిపిస్తున్న మాట.ఈ పరిస్థితిలో లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి మంగళగిరి ప్రజల సమాధానం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube