ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడం కోసం జనవాణి కార్యక్రమం - నాదెండ్ల మనోహర్

విజయవాడ: పియేసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్.ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడం కోసం జనవాణి కార్యక్రమం చేపడతామని.

 Janasena Party Janavani Program Starts From Vijayawada By Pawan Kalyan Details,-TeluguStop.com

జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విజయవాడ నుంచి ప్రారంభం కాబోతుంది.గత ముఖ్యమంత్రులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు.అనేక వర్గాలు సమస్యలతో సతమతం అవుతున్నా సీఎం స్పందించడం లేదు.

అమరావతి రైతులు సైతం సీఎం అన్యాయం చేశారు.జనవాణి జనసేన భరోసా పేరుతో 3వ తేదీ,10వ న పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రభుత్వంలో విధులు నిర్వర్తించిన వారికి సైతం సీఎం అన్యాయం చేశారు.సమస్య ఉందని అడిగితే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారు .సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈజీ ఆఫ్ డోయింగ్ బిజినెస్ ఎవరికి లబ్ధి చేకూరింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారు.వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వచ్చారో చూపించాలి.63 ఎకరాలు భూమిని అనంతపురంలో ఎవరికి కేటాయించారు.కియా సైంటాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఎవరిది,ఎందుకు భూమి కేటాయించారు.స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలకు న్యాయం జరగడం లేదు.రోడ్లపై సీఎం జగన్ విసిరిన సవాల్ ను జనసేన స్వీకరిస్తుంది.రోడ్లు ఎక్కడ నిర్మాణం చేశారో,ndb ద్వార వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలి.

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై జనసేన పోరాటం చేస్తోంది.రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ప్రజలకు అర్దం అయ్యేలా చెప్తాం.గడప గడపకు మన ప్రభుత్వం అనేది ఒక బూటకం.జిల్లా కలెక్టర్లు చేస్తున్న స్పందనలో న్యాయం జరిగేది సున్యాం.

రాజధాని నిర్మాణం చెయ్యలేని మీరు భూములు ఎలా అమ్ముతారు.రాజధాని రైతులకు, రైతు కూలీలకు ఏమి న్యాయం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న 74మంది రైతుల్లో అర్హులు కానీ వాళ్ళు ఎవ్వరో సీఎం చెప్పాలి.వైసీపీ నేతలను జనసేన చేపట్టిన కౌలు రైతుల బరోసా యాత్రకు రావాలని సవాల్ విసురుతున్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube