పూనమ్ కౌర్ కొత్త బిచ్చగత్తె.. ఆర్జీవీ పిచ్చోడు.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏ తప్పు చేయకపోయినా ఆయనను కావాలని టార్గెట్ చేసి ట్రోల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ గురించి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేయగా ఆర్జీవీ పవన్ నిర్ణయాలపై తరచూ విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్( Sampath Naik ) ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ పూనమ్ కౌర్, ఆర్జీవీలపై షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు పవన్ ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తున్నాయి.

రాజకీయంగా పవన్ ను ఎదుర్కోలేక అనేకమంది బిచ్చగాళ్లు వచ్చారని ఆ బిచ్చగాళ్లలో కొత్త బిచ్చగత్తె పూనమ్ కౌర్ ( Poonam Kaur )అని ఆయన అన్నారు.పవన్ తన పని తాను చేసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా పవన్ చేశారని సంపత్ నాయక్ వెల్లడించడం గమనార్హం.

కత్తి మహేష్( Kathi Mahesh ) పవన్ పై విమర్శించారని ఆ తర్వాత శ్రీరెడ్డి, పోసాని విమర్శలు చేశారని ఇప్పుడు ఆర్జీవీ, పూనమ్ పవన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు.ప్రజల తరపున మాట్లాడటమే పవన్ కళ్యాణ్ చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు.2024 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పవన్ పై బురద చల్లుతున్నారని సంపత్ నాయక్ అన్నారు.పవన్ కు దేశంపై ఉన్న ప్రేమ వల్లే సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) అని టైటిల్ పెట్టారని ఆయన తెలిపారు.

Advertisement

పూనమ్ కౌర్ కు మెంటల్ గా స్టబిలిటీ ఉందా అని ఆయన ప్రశ్నించారు.నీతి, నిజాయితీ, ధర్మం పవన్ లో ఉండటం వల్లే ఆయనను నేను అభిమానిస్తామని సంపత్ అన్నారు.ఆర్జీవీ పిచ్చోడు అని సంపత్ నాయక్ పేర్కొన్నారు.

శివ సినిమా తర్వాత ఆర్జీవీ ఖాతాలో హిట్లు లేవని బోల్డ్ సినిమాలు తీసి ఆయన బ్రతుకుతున్నాడని సంపత్ నాయక్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు