చిరంజీవి, పవన్ కాళ్లను బన్నీ మొక్కాలి.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా చేసిన కొన్ని పనులపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.

మెగా ఫ్యాన్స్ తో పాటు కూటమి అభిమానులు సైతం బన్నీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్( MLA Bolisetty Srinivas ) బన్నీ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అయ్యాయనే సంగతి తెలిసిందే.జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు( Chalamalasetty Ramesh Babu ) తాజాగా బన్నీ గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఈ నేత బన్నీ హీరో అనుకుంటున్నాడు కానీ బన్నీ కమెడియన్ మాత్రమేనని తెలిపారు.చిరు, పవన్, నాగబాబు అండ చూసుకుని బన్నీ సినిమాల్లోకి వచ్చాడని వాళ్లను విమర్శించే స్థాయి బన్నీకి లేదని చలమలశెట్టి రమేశ్ బాబు చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) మహావృక్షం లాంటివాడని బన్నీ నీడ ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.అల్లు అరవింద్, బన్నీ పిల్లికి సైతం బిచ్చం పెట్టలేని వాళ్లు అని ఆయన కామెంట్లు చేశారు.బన్నీ తన స్థాయి ఏమిటో ముందు చూసుకోవాలని చలమలశెట్టి రమేశ్ బాబు వెల్లడించారు.

Advertisement

చిరు, పవన్, నాగబాబు కాళ్లు కడిగి బన్నీ ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే తప్ప బన్నీ చేసిన తప్పు సరికాదని ఆయన పేర్కొన్నారు.

డిసెంబర్ లో విడుదలవుతున్న పుష్ప 2( Pushpa 2 ) మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తానంటూ ఆయన కామెంట్లు చేశారు.మా నియోజకవర్గంలో బన్నీ ఫ్లెక్సీలు కట్టేవాళ్లు సైతం ఎవరూ లేరని రమేశ్ బాబు వెల్లడించారు.రమేశ్ బాబు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా ఈ కామెంట్లపై బన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి.

మెగా ఫ్యామిలీకి, బన్నీకి మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల్లోనూ పోటీ .. భారీ ఆశలతో బీజేపీ 
Advertisement

తాజా వార్తలు