కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత బొలిశెట్టి ( Bolishetti )మరోసారి భేటీ అయ్యారు.ఈ క్రమంలోనే మరి కాసేపటిలో బొలిశెట్టి సమావేశం కానున్నారు.
కాగా గత మూడు రోజుల క్రితం కూడా బొలిశెట్టి ముద్రగడతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.తాజాగా ఇవాళ మరోసారి బొలిశెట్టి లంచ్ కి వస్తానని చెప్పడంతో ముద్రగడ ఆహ్వానించారని తెలుస్తోంది.
సంక్రాంతి తరువాత క్లిరంపూడికి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వస్తారని ముద్రగడ అనుచరులు చెబుతున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ముద్రగడను పవన్ కల్యాణ్ కలిసిన తరువాతే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ముద్రగడ అనుచరులు తెలిపారని సమాచారం.
అయితే ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.