ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఒంటరిగా… ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.ఏదో ఒక పార్టీతో జత కట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి.అందుకే తమకు అనుకూలంగా ఉండే ప్రత్యర్థి పార్టీలను ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకుని ఎన్నికల వరకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి.ఒంటరిగా….ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో అన్ని పార్టీలకు తెలుసు.

అందుకే పైకి చెప్తున్నంత గంభీరంగా పార్టీ అధినేతలు ఉండలేకపోతున్నారు.అందుకే… తెరవెనుక పక్క పార్టీలతో బేరసారాలు చేస్తున్నారు.ఈ విధమైన వదంతులు ఇప్పటికే వై ఎస్ ఆర్- కాంగ్రెస్ పార్టీ జనసేన గురించి కథలు కథలుగా కథనాలు వచ్చాయి.
వైసీపీ తో జనసేన పొత్తు ఖరారు అయిపోయిందని… బేరం ఫిక్స్ అయిపోయింది అని కధనాలు వచ్చాయి.
అయితే అధికారిక ప్రయత్నం రావాల్సి ఉందని వార్తలు వచ్చాయి అయితే కలిసి తాము ముందుకు వెళ్లేది లేదని అసలు పొత్తు అంశంపై ఇరు పార్టీల మధ్య చర్చకు రాలేదని అటు పవన్ ఇటు జగన్ ఇద్దరూ ప్రకటించారు.
అయితే ఈ కథ ఇక్కడితో ముగిసింది అనుకుంటుండగానే… ఇప్పుడు టిడిపి-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లి పోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం జనసేన పార్టీ.
ఈ విషయం అందరికీ తెలుసు.అయితే ఆ తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపి తో విభేదించి జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు.
సీఎం సీఎం అంటూ అభిమానులతో నినాదాలు కూడా చేయించుకుంటున్నాడు.
ఈ సందర్భంగా వైసిపి జనసేన పార్టీ ల మీద వైసిపి టిడిపి పార్టీల మీద విమర్శల బాణాలు కూడా వదిలాడు.
అయితే కొద్ది రోజులుగా పరిణామాలు గమనిస్తే… టీడీపీ మీద దాడి తగ్గింది.దీనికి కారణం ఏంటా అని అంతా అనుకుంటుండగానే … టిడిపి జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్టు… ఈ మేరకు ఆ పార్టీ ఇరు పార్టీల మధ్య రాయబారం ఇచ్చినట్టు సమాచారం.

ఒకవేళ ఈ ప్రతిపాదన సెట్ అవ్వకపోతే ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయని గుసగుసలు మొదలయ్యాయి.అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ నెల 30న చంద్రబాబు పవన్ కళ్యాణ్ రహస్యంగా భేటీ అవుతున్నారట.ఈ మేరకు టిడిపికి చెందిన కీలక నేత ఒకరు ఇప్పటికే పవన్ తో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.







