ఏపీలో బిజీ షెడ్యూల్ తో కేసీఆర్ టూర్ .... రిటర్న్ గిఫ్ట్ కోసమే !

మొత్తానికి కేసీఆర్ తాను అనుకున్న పంతాన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నాడు.ఏదో ఒక విధంగా ఏపీలో చంద్రబాబును మరోసారి గద్దె ఎక్కకుండా చేయాలనే ప్లాన్ లో కేసీఆర్ కొత్త కొత్త స్కెచ్ లు వేస్తున్నాడు.

 Kcr With Busy Schedule In Andhra Pradesh-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఏపీలో తన టూర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ పర్యటనలోనే చంద్రబాబు మీద విమర్శలు గుప్పించి వైసీపీకి మేలుకలిగేలా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.అందుకే… ఇప్పుడు పూర్తిస్థాయిలో ఇక్కడ ద్రుష్టి కేంద్రీకరించాడు.

ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ఏపీలో టూర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.అమరావతిలో.వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం, ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు ఉంటాయి.

సంయుక్త మీడియా సమావేశం కూడా సాధారణంగా ఉంటుంది.

ఆ తర్వతా విశాఖ శారదా పీఠంలో జరిగే.

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తారు.ఈ మేరకు ప్రత్యేక ఆహ్వానాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద .కేసీఆర్‌కు పంపడం.ఆయన సానుకూలత వ్యక్తం చేయడం కూడా జరిగిపోయాయి.

అంటే.ఫిబ్రవరి 14న ఏపీలో కేసీఆర్.రెండు కార్యక్రమాలకు హాజరవుతారు.ఈ రెండింటికి బయట రాజకీయాలకు సంబంధం లేనట్టుగా కనిపిస్తున్నా… అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుందట.

కేసీఆర్ ఏపీ టూర్ తో రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయని అంతా భావిస్తున్నారు.అలాగే కేసీఆర్.

ఏపీకి వస్తే చంద్రబాబు కి మైనస్ .వైసీపీకి ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకునే పనిలో పడ్డాడు జగన్.

అందుకే.కేసీఆర్‌ను తన గృహప్రవేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారట.ఇప్పటికే.గృహప్రవేశ ముహుర్తాన్ని నిర్ణయించారు.ఫిబ్రవరి పధ్నాలుగు కోసం ఇంటిని తుది మెరుగులు దిద్దుతున్నారు.అదే సమయంలో.

స్వరూపానంద ఆశ్రమంలో.అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు కేసీఆర్ కు ఆహ్వానం లభించింది.

స్వరూపానంద ఇప్పుడు కేసీఆర్‌, జగన్‌కు ఆధ్యాత్మిక గురువుగా మారారు.కేసీఆర్ కోసం.

ఆయన ఇటీవలే భారీ యాగాన్ని కూడా.కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు.

గతంలో రాజశ్యామల హోమాన్ని కూడా చేయించారు.అందుకే.

ఫెడరల్ ఫ్రంట్ టూర్లను శారదాపీఠం నుంచే కేసీఆర్ ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube