తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమర్ దీప్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో రామచంద్ర అనే పాత్రలో ఏమీ తెలియని ఒక అమాయకుడి లాగా కనిపిస్తూ ఉంటాడు.ఇకపోతే అమర్ దీప్ చౌదరి ఇటీవల కోయిలమ్మ సీరియల్ నటి తేజస్విని గౌడతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు.ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కామెడీ షో మేనేజర్ తనను ఏ విధంగా అవమానించారో చెప్పుకొచ్చారు అమర్ దీప్ చౌదరి.
సినిమాలకు,సీరియల్స్ రెండింటికీ పెద్ద తేడా లేదు.సీరియల్ హీరో అయితే సినిమా హీరో కూడా కావచ్చు.సీరియల్‌లో క్లిక్ అయ్యి సినిమాల్లో అవకాశం ఇస్తే అతను హీరో అవుతాడు.ఇవ్వకపోతే సీరియల్ హీరోగానే మిగిలిపోతాడు.
మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత లక్ ఉండాలని తెలిపారు అమర్ దీప్.అయితే అవకాశాలు అందరికీ వస్తాయి.
దానికి కష్టపడాలి.ఎవడో రికమండ్ చేస్తేనో వేరే వాడు తీసుకుని వస్తేనో పేరు రాదు.
చెప్పులు అరిగేలా తిరిగి చెప్పు దెబ్బల్లాంటి మాటలు పడితే అప్పుడు లైఫ్‌లో పైకి వస్తాము అని చెప్పుకొచ్చాడు అమర్ దీప్.అయితే చాలామంది లాగే నేను కూడా నా లైఫ్ లో అలాంటి మాటలు చాలా పడ్డాను.

పెద్ద సినిమాలను చిన్నపాత్రలు చేసినప్పుడు అటువంటి అవమానాలు చాలా ఎదురయ్యాయి.ఇక జబర్దస్త్ షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు అన్నారో నాకు బాగా తెలుసు.నన్ను అవమానించిన అదే జబర్దస్త్ మేనేజర్ మూడేళ్ల తర్వాత నాకు ఫోన్ చేసి ఈ సార్ మీ డేట్లు కావాలని అడిగాడు.అప్పుడు నేను అన్నావు కదా, చేసావు కదా, చూసావు కదా ఇంకెప్పుడూ అలా మాట్లాడవద్దు అని అతనికి చెప్పాను అని చెప్పుకొచ్చాడు అమర్ దీప్.
ఆ జబర్దస్త్ మేనేజర్ నాకు ఫోన్ చేసి హలో సార్ అన్నప్పుడే సగం చచ్చిపోయాడు.ఆ తరువాత డేట్స్ అడిగినప్పుడు వాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చినట్టే అది చాలు సగం సచ్చినట్టే అని తెలిపారు అమర్ దీప్.
బుల్లి తెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడు ఈ వెంట లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ సందడి చేస్తూ ఉంటాడు అమర్ దీప్.