ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించగా ఆ సమయంలో… పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు.ఆ తర్వాత 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేయగా ఒక స్థానం మాత్రమే గెలవడం జరిగింది.
ఆ ఎన్నికలలో పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.ఇదిలా ఉంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో పోటీ చేయటానికి అన్ని రకాలుగా పవన్ సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలో మరోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఇక అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో జనసేన గాజు గ్లాస్ గుర్తుకు కష్టాలు ఎదురయ్యాయి.
జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు( Glass symbol )ను రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ( Praja Congress Prat ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తమ పార్టీ దరఖాస్తు చేసుకున్నట్లు అయితే ఎన్నికల సంఘం తమని సంప్రదించకుండా మంతనాలు జరపకుండా జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.ఈ క్రమంలో పిటిషన్ లో కేంద్ర ఎన్నికల సంఘం మరియు జనసేన పార్టీని ప్రతివాదులుగా చేర్చారు.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం జనసేనతో కూమ్మక్కై ఆ గుర్తును తనకు రాకుండా చేశాయని ఆరోపించారు.దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో గాజు గ్లాస్ గుర్తు కోసం ముందు జనసేన దరఖాస్తు చేసుకుందని కోర్టుకి ఈసీ తెలిపింది.
అయితే ప్రభుత్వ ఆఫీసు ఉదయం 10 గంటలకు తెరవరని.గాజు గ్లాస్ దరఖాస్తు స్వీకరణ కోసం.ఉదయం 9:15 నిమిషాలుగా ఉందని పిటిషనర్ ఆధారాలను సమర్పించారు.దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది.