జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు.
మార్చి 14వ తారీకు మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి సభా ప్రాంగణానికి వారాహి వాహనం ద్వారా అధ్యక్షుడు పవన్ సభ వేదికపై చేరుకుంటారని స్పష్టం చేశారు.ఇదే సమయంలో దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటారని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రీతిలో ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచే విధంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.వైసీపీ ప్రభుత్వం రైతులను కష్టాలు పెడుతుందని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మార్చి 14వ తారీఖు నాడు జరగబోయే సభలో భవిష్యత్ కార్యచరణ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపారు.కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయం అని గతంలో అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.