జనసేన కీలక సమావేశం : సీట్లపై పవన్ తేల్చేస్తారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారాన్ని పూర్తి చేసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది.ఈ దిశగా డిసెంబర్ రెండో తారీఖున జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Jana Sena Key Meeting Will Pawan Decide On The Seats , Jana Sena, Pawan Kaly-TeluguStop.com

దీనిలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్న స్థానాలపై జన సైనికులకు, పార్టీ కార్యకర్తలకు పవన్ ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా టికెట్లు దక్కని వారు అవసరమైన హంగామా చేయకుండా ముందుగానే వారిని ప్రిపేర్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Andhrapradesh, Jana Sena, Pawan Kalyan-Telugu Top Posts

తెలుగుదేశంతో పొత్తు చారిత్రక అవసరమని అలాంటప్పుడు కొన్ని త్యాగాలు చేసైనా సరే పొత్తును పలప్రదం చేసుకోవాలని పార్టీ నేతలకు పవన్ క్లాస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది, తమ బలా బలాలను నిష్పక్షపాతంగా అంచనా వేసి కచ్చితంగా గెలుస్తామననే స్థానాలని తీసుకోవాలని, ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తీసుకుని మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా జిల్లాకు రెండు సీట్లు చొప్పున జనసేన పట్టుపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .దీనిని బట్టి చూస్తే కనీసం 40 కి తక్కువ కాకుండా సీట్లను జనసేన తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Andhrapradesh, Jana Sena, Pawan Kalyan-Telugu Top Posts

దీనిపై జనసైనికులకు పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి గురి కాకుండా పార్టీకి దీర్ఘకాల భవిష్యత్తు ఉందని, అనేక పదవులకు ప్రాతినిధ్యం కల్పిస్తామనే హామీతో టికెట్ దక్కని వారిని పవను ఊరడిస్తారని ప్రచారం జరుగుతుంది.ఇలా ఇటు చూసిన జనసేన రాజకీయ బవిష్యత్తు కి సంబందించి ఇది అతి ముఖ్య మైన కార్యక్రమం గా ప్రచారం జరుగుతుంది .ఇందులో తీసుకునే నిర్ణయాలు బట్టి జనసైనికులకు కూడా తమ పార్టీ విది విదానాలు పై ఒక స్పషమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది .మరి తమ పార్టీ శ్రేణులను పవన్ ఏ మేరకు సంతృప్తి పరచగలరో సమావేశం పూర్తి అయితే ఒక అంచనా కు రావచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube