సీట్ల పంపకాలు మినహా .. అన్నిటిపై క్లారిటీకి వచ్చిన జనసేన, టీడీపీ ! 

ఏపీలో పొత్తులు పెట్టుకున్న టిడిపి , జనసేన పార్టీలు అన్ని విషయాలను ఒక క్లారిటీకి వచ్చేందుకు నిన్న రాజమండ్రి లో నిర్వహించిన రెండు పార్టీల సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీలో వైసిపి మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా అనేక నిర్ణయాలను తీసుకున్నారు.

 Jana Sena And Tdp Came To Clarity On Everything Except For Sending Seats, Tdp,-TeluguStop.com

నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్ లో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అయింది .టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ),  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) , రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశం లో చర్చించారు.ఈ సందర్భంగా సీట్ల పంపకాలు మినహా,  మిగిలిన అన్ని అంశాల పైన ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం .జనసేన టిడిపి కలిసి చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు రెండు పార్టీల కేడర్ హాజరయ్యే విధంగా  నిర్ణయించుకున్నారు.

Telugu Ap, Chandrababu, Lokesh, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics

అలాగే ఉమ్మడిగా జిల్లా పార్లమెంట్ అసెంబ్లీ మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు పైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జనసేన , టిడిపి పొత్తులో భాగంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా,  వాటిని పరిష్కరించే విధంగా కమిటీలకు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు .నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఇంచార్జీలు సమన్వయంతో సర్దుబాటులతో పనిచేసే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.గతంలో సీట్లు ఆశించి పొత్తు వల్ల సీటు రాక మరో ఆలోచనలో ఉన్న వారితోనూ చర్చలు జరపాలని, వారు అసంతృప్తికి గురవ్వకుండా పార్టీలో కొనసాగే విధంగా ఒప్పించాలని నిర్ణయించారు.

Telugu Ap, Chandrababu, Lokesh, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Politics

వైసిపి ప్రభుత్వం( YCP ) పై ఒత్తిడి పెంచడమే ఎజెండాగా విడివిడిగాను , ఉమ్మడిగాను ఉద్యమాలు చేపట్టాలని,  రైతు సమస్యలు , కరువు పై ప్రధానంగా దృష్టి పెట్టాలని,  అలాగే ఓటర్ల తొలగింపు పైన రెండు పార్టీలు కలిసి పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం మినహా అన్ని విషయాల పైన ఒక క్లారిటీకి వచ్చారు.టిడిపి అదినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి రెండు పార్టీల సమన్వయ కమిటీలు సమావేశమై చంద్రబాబు సమక్షంలోనే  సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించాలని నిర్ణయించుకున్నారట.అలాగే టిడిపి , జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను వాస్తవంగా దసరాకు విడుదల చేయాలని భావించినా,  చంద్రబాబు అరెస్టు కారణంగా దానిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు .చంద్రబాబు బెయిల్ పై విడుదలైన తర్వాతే మేనిఫెస్టో పై ప్రకటన కూడా చేయాలని నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube