ఇటలీని విజిట్ చేయడానికి జైశంకర్ రెడీ.. పోర్చుగల్ అధికారులతో చర్చలు..

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్( S Jaishankar ) తన నాలుగు రోజుల దౌత్య పర్యటనలో భాగంగా 2023, అక్టోబర్ 31న పోర్చుగల్‌ను సందర్శించారు.ఆ రోజు పోర్చుగీస్ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.

 Jaishankar Ready To Visit Italy Talks With Portuguese Authorities , S Jaishanka-TeluguStop.com

పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.భారతీయ ప్రవాసులతో కూడా సంభాషించారు.

మహాత్మా గాంధీ, కస్తూర్బాకు నివాళులర్పించారు.

Telugu Antonio Costa, Antonio Tajani, Augustosantos, Italy, Joao Cravinho, Mahat

జైశంకర్ మొదటి సమావేశం పోర్చుగల్ ప్రధాన మంత్రి ఆంటోనియోకోస్టా( António Costa )తో జరిగింది.జైశంకర్ ఆంటోనియోకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేసారు.భారతదేశం-పోర్చుగల్ సంబంధాలను పెంపొందించడానికి కోస్టా మార్గదర్శకత్వాన్ని ప్రశంసించారు.

భారత్-ఈయూ సంబంధాలకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.జైశంకర్ ట్వీట్ చేస్తూ, “ఈరోజు (మంగళవారం) ప్రధాని ఆంటోనియో కోస్టాను కలవడం ఆనందంగా ఉంది.

ఆయన సమకాలీన సవాళ్లను చర్చించారు, ఇరుదేశాల సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు ఆయన మార్గనిర్దేశం చేశారు.

Telugu Antonio Costa, Antonio Tajani, Augustosantos, Italy, Joao Cravinho, Mahat

జైశంకర్ పోర్చుగల్ విదేశాంగ మంత్రి జోవో క్రావిన్హోతో కూడా చర్చలు జరిపారు.ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో పురోగతిపై ఎక్కువగా మాట్లాడారు.పశ్చిమాసియా, ఉక్రెయిన్, మధ్య ఆసియా, ఇండో-పసిఫిక్ సహా ప్రపంచ ప్రాంతాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

జైశంకర్ పోర్చుగీస్ రిపబ్లిక్ అసెంబ్లీ అధ్యక్షుడు అగస్టో శాంటోస్ సిల్వాతో కూడా సమావేశమయ్యారు.అస్థిర ప్రపంచంలో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సన్నిహిత సహకారం యొక్క ప్రాముఖ్యతను వారు చర్చించారు.

జైశంకర్ ఎన్నారైలను కలిసి, లిస్బన్‌లోని రాధా కృష్ణ దేవాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ( Mahatma Gandhi ), అతని భార్య కస్తూర్బా స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.పోర్చుగల్ పర్యటన తర్వాత, జైశంకర్ ఇటలీకి పయనం కానున్నారు.

అక్కడ అతను తన ఇటాలియన్ ఉన్నతాధికారి ఆంటోనియో తజానీని కలుస్తారు.తజానీ రక్షణ మంత్రి, ‘మేడ్ ఇన్ ఇటలీ’ మంత్రిగా పనిచేస్తున్నారు.

మార్చిలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఢిల్లీ పర్యటన తర్వాత భారతదేశం, ఇటలీ మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి నాంది పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube