జైసల్మేర్‌లోని( Jaisalmer ) మోహన్‌గఢ్ కాలువ( Mohangarh Canal ) ప్రాంతంలో జరిగిన అరుదైన భౌగోళిక సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
ఒక రైతు పొలంలో బోరుబావి( Borewell ) తవ్వుతుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.
ఈ సంఘటనలో భూమి నుంచి నీరు, గ్యాస్ తీవ్ర ఒత్తిడితో బయటకు రావడం ప్రారంభమైంది.బోరింగ్ పనులకు ఉపయోగించిన యంత్రాలు, ట్రక్కు భూమిలో కూరుకుపోయాయి.
ఆ తర్వాత భూమిలో నుండి నీటి ప్రవాహం 10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడింది.ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటన జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ కాలువ ప్రాంతంలోని విక్రమ్‌సింగ్ అనే రైతు పొలంలో చోటుచేసుకుంది.బోరుబావి కోసం 850 అడుగుల మేర తవ్వుతుండగా అకస్మాత్తుగా భూమి కుంగింది.దీనివల్ల భూగర్భం నుంచి నీరు,( Water ) గ్యాస్( Gas ) తీవ్రమైన ఒత్తిడితో బయటకు వచ్చాయి.
నీటి పీడనంతో పాటు, తెల్లరంగు ఇసుక కూడా బైటపడింది.దాదాపు 12 గంటల పాటు నీటి ప్రవాహం నిరంతరంగా కొనసాగింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే భూగర్భ జల శాస్త్రవేత్తలు, జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.భూగర్భ జల నిపుణులు ఈ ప్రాంతంలో భారీ నీటి రిజర్వాయర్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.పరిపాలనా చర్యలతో పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
భూగర్భ నీటి ఉప్పెన ఇంకా కొనసాగుతుండటంతో, ఈ ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ప్రవేశాన్ని నిషేధించారు.తాత్కాలిక పోలీసు పోస్టు ఏర్పాటు చేసి, గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఆయిల్ గ్యాస్ సంస్థ ఓఎన్‌జీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.భూగర్భ శాస్త్ర నిపుణులు డాక్టర్ నారాయణ్ దాస్ ఇంఖియా ఈ ఘటనపై మాట్లాడుతూ, ఇసుక రాతి నిర్మాణం కారణంగా నీటి ఉప్పెన సంభవించిందని తెలిపారు.
ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఉప్పు నీరుగా ఉండటాన్ని గమనించామని, గ్యాస్ లీకేజీ వల్ల నీటి ప్రవాహం మరింత ఉద్ధృతం అవుతుందని చెప్పారు.భూమి నుండి నీరు, గ్యాస్ ఉప్పెనతో భయానక దృశ్యాలు కనిపించాయి.
దీనివల్ల చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకొని, గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy