జైలర్ సినిమాలో రజనీ మనవడిగా నటించిన ఈ బుడ్డోడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే! 

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) తాజాగా జైలర్ సినిమా ( Jailer Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే.

 Jailer Movie Child Artist Full Details Inside, Jailer Movie, Rajinikanth, Ramya-TeluguStop.com

నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Deelip Kumar ) దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో జైలర్ సినిమా నిర్మాత కళానిధి మారన్ చిత్ర బృందానికి పెద్ద ఎత్తున కానుకలను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో ఒక బుడ్డోడు నటించారు.

Telugu Jailer, Jailerchild, Rajinikanth, Ramya Krishna, Reethu-Movie

ఇలా ఈ చిన్నారి తన నటనతో అందరి దృష్టికి ఆకర్షించారు.ఎంతో అద్భుతంగా నటిస్తూ ఉన్నటువంటి ఈ బుడ్డోడు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈ చిన్నారి ఇదివరకే కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమాలో కూడా నటించారు.ఇక ఈ చిన్నారి సినిమాలలోకి రాకముందు తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.

ఇతనికి రీతూ రాక్స్( Reethu Rocks ) అనే యూట్యూబ్ ఛానల్ ఏకంగా 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త కాన్సెప్ట్స్ అన్నింటిని షేర్ చేస్తూ ఎంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Telugu Jailer, Jailerchild, Rajinikanth, Ramya Krishna, Reethu-Movie

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ చిన్నారికి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయన తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమాలో నటించినటువంటి ఈ చిన్నారి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు స్వయాన బంధువు అవుతారట.నెల్సన్ కజిన్ కుమారుడనే విషయాన్ని డైరెక్టర్ ఈ సినిమా ఈవెంట్లో తెలియచేశారు.

ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే తన నటనతో అందరిని మెప్పించినటువంటి ఈ చిన్నారి పెద్దయిన తర్వాత హీరోగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పని లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube