జైలర్ సినిమాలో రజనీ మనవడిగా నటించిన ఈ బుడ్డోడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే! 

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) తాజాగా జైలర్ సినిమా ( Jailer Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే.నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Deelip Kumar ) దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో జైలర్ సినిమా నిర్మాత కళానిధి మారన్ చిత్ర బృందానికి పెద్ద ఎత్తున కానుకలను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో ఒక బుడ్డోడు నటించారు. """/" / ఇలా ఈ చిన్నారి తన నటనతో అందరి దృష్టికి ఆకర్షించారు.

ఎంతో అద్భుతంగా నటిస్తూ ఉన్నటువంటి ఈ బుడ్డోడు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈ చిన్నారి ఇదివరకే కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమాలో కూడా నటించారు.

ఇక ఈ చిన్నారి సినిమాలలోకి రాకముందు తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.

ఇతనికి రీతూ రాక్స్( Reethu Rocks ) అనే యూట్యూబ్ ఛానల్ ఏకంగా 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త కాన్సెప్ట్స్ అన్నింటిని షేర్ చేస్తూ ఎంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

"""/" / ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ చిన్నారికి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయన తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో నటించినటువంటి ఈ చిన్నారి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు స్వయాన బంధువు అవుతారట.

నెల్సన్ కజిన్ కుమారుడనే విషయాన్ని డైరెక్టర్ ఈ సినిమా ఈవెంట్లో తెలియచేశారు.ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే తన నటనతో అందరిని మెప్పించినటువంటి ఈ చిన్నారి పెద్దయిన తర్వాత హీరోగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పని లేదు.