Jailer Movie : బుల్లితెరపై రజనీకాంత్ మూవీకి దిమ్మతిరిగే షాక్.. జైలర్ మూవీ రేటింగ్ ఇంత ఘోరమా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Jailer Disappoints On Small Screen-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఇటీవల జైలర్ సినిమా( Jailer Movie )తో ప్రేక్షకులను పలకరించారు రజినీకాంత్.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

తమిళనాట ఈ సినిమా రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పవచ్చు.

Telugu Jailer, Mohanlal, Rajinikanth, Ramya Krishnan, Small Screen, Tamannaah-Mo

అయితే ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన జైలర్ సినిమా, ఎందుకో బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.వినడానికి కాస్త షాకింగ్ గా అనిపించినా కూడా ఇదే నిజం.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జైలర్ సినిమాను జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తే, కేవలం 5.2 టీఆర్పీ మాత్రమే వచ్చింది.థియేటర్లో సూపర్ హిట్ అయిన సినిమాకు బుల్లితెరపై దారుణమైన టిఆర్పి రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

దీపావళి కానుకగా ఈ సినిమాను ఒకేసారి అన్ని భాషల్లో ప్రసారం చేసింది జెమినీ ఛానెల్.ఊహించినట్టుగానే తమిళనాట జైలర్ కు బంపర్ టీఆర్పీ వచ్చింది.కానీ అదే సమయంలో తెలుగులో ఆకట్టుకోలేకపోయింది.

Telugu Jailer, Mohanlal, Rajinikanth, Ramya Krishnan, Small Screen, Tamannaah-Mo

అయితే బుల్లితెరపై ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి మూవీ మేకర్స్ తో పాటు రజనీకాంత్ కూడా షాక్ అయినట్టు తెలుస్తోంది.ఈ సినిమా ఫలితాన్ని బట్టి చూస్తే బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి.ఈ సినిమా విషయానికొస్తే.

నెల్సన్( Nelson Dilipkumar ) డైరక్ట్ చేసిన జైలర్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయగన్, సునీల్, యోగిబాబు నటించారు.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube