అవయవదానంతో ఖైదీలకు జైలు శిక్ష తగ్గింపు.. తీవ్ర దుమారం

సాధారణంగా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిందంటే ఆ ఖైదీలు చాలా తీవ్రమైన నేరాలు చేసి ఉంటారు.దీంతో న్యాయస్థానాలు వారిని సుదీర్ఘ కాలం జైళ్లలోనే ఉంచుతాయి.

 Jail Sentence Reduction For Prisoners With Amputation ,american, Prisoners , Am-TeluguStop.com

వారు విడుదలైతే మరోసారి తీవ్ర నేరాలు చేసి, అమాయకుల ప్రాణాలు కూడా తీయొచ్చని భావిస్తాయి.దీంతో జైలు శిక్షే సరైనదని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తుంటాయి.

అయితే జైళ్లలో సత్ప్రవర్తన కారణంగా చాలా మంది ఖైదీలు ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో విడుదల అవుతుంటారు.అమెరికాలో మాత్రం వింత బిల్లును అక్కడి పాలకులు రూపొందిస్తున్నారు.

అవయవ దానం చేస్తే జైలు శిక్ష తగ్గించేలా ఆ బిల్లుకు రూపకల్పన చేశారు.ఇది అక్కడ తీవ్ర దుమారం రేపుతోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu American, Jail, Jail Sentence, Massachusetts, Organ, Prisoners, Latest-Te

అమెరికాలోని మసాచుసెట్స్‌లో అవయవదానం చేసే ఖైదీలకు జైలు శిక్ష తగ్గించాలని బిల్లు రూపొందిస్తున్నారు.వారు చేసే అవయవ దానాన్ని బట్టి ఖైదీలకు జైలు శిక్షలో కనీసం 40 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు శిక్ష తగ్గుతుంది.దీనిపై విమర్శకులు మండిపడుతున్నారు.

ఇది పూర్తిగా అనైతికం అని విమర్శిస్తున్నారు.ప్రస్తుతం, అమెరికన్ ఫెడరల్ జైళ్లలో అవయవ దానం అనుమతించబడుతుంది.

అయితే అవయవ దానాన్ని ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు మాత్రమే చేయాల్సి ఉంటుంది.దీనిలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు.మసాచుసెట్స్‌లో

Telugu American, Jail, Jail Sentence, Massachusetts, Organ, Prisoners, Latest-Te

ప్రతిపాదిత బిల్లు రాష్ట్ర సంస్కరణ విభాగం రూపొందిస్తోంది.ఐదుగురు వ్యక్తుల కమిటీ దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది.ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సుమారు 5,000 మంది ఖైదీలు అవయవ మార్పిడి వెయిటింగ్ లిస్టులో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.అయితే ప్రస్తుతం అక్కడి జైళ్లలో ఎక్కువ మంది ఖైదీలు నల్ల జాతీయులే.

అవయవదానం చేస్తే ఖైదీల అనారోగ్యం క్షీణిస్తుందని, వారికి జైళ్లలో తగిన వైద్య సౌకర్యాలు అందవని విమర్శకులు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube