తెలుగు ప్రేక్షకులకు నటి సంతోషి శ్రీకర్( Santhoshi Srikar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సంతోషి శ్రీకర్ అంటే ఏం గుర్తుపట్టకపోవచ్చు కానీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ లో నటించిన సంతోషి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అవ్వడంతో పాటు భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.అంతేకాకుండా ఈ సినిమాలో పనిమనిషిగా కామెడీని బాగా పండించి నంది అవార్డుని సైతం అందుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.

అయితే తమిళంలో ఎక్కువగా సైడ్ క్యారెక్టర్లు చేసి తమిళంలోని స్థిరపడిపోయింది సంతోషి శ్రీకర్.తర్వాత సిల్వర్ స్క్రీన్‌ను వదిలేసి స్మాల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది.అక్కడ సీరియల్స్ చేసింది.
కొంతకాలంగా సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉంటోంది.అయితే ఆమె ఉన్నఫలంగా సినిమాలకు సీరియల్స్ కు దూరం అవ్వడం గనుక ఉన్న కారణం ఏంటో తెలియక అభిమానులు చాలా సందర్భాలలో ప్రశ్నించారు.
తాజాగా ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఈ సందర్బంగా సంతోషి మాట్లాడుతూ.
నాన్నది విజయవాడ.పుట్టి పెరిగిందంతా చెన్నైలో.జై సినిమా చేసేటప్పుడు కూడా తెలుగు రాదు.కానీ నా భర్తది హైదరాబాద్.మేమిద్దరం కలిసి హీరోహీరోయిన్స్ గా సీరియల్ చేశాము.

రియల్ లైఫ్ లోనూ భార్యాభర్తలం అయ్యాము.జై, ఆర్య రెండు సినిమాలకు నన్ను సెలక్ట్ చేశారు.అయితే జై చిత్రానికి నేను పర్ఫెక్ట్ అని భావించడంతో అందులోకి తీసుకున్నారు.
ఆర్య చేజారిపోయింది.పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి.
చాలా వదులుకున్నాను.అయితే జై సినిమా( Jai movie )లో ఏడ్చే సీన్ ఉంటుంది.
నాకు కన్నీళ్లు రావడం లేదని కొట్టి మరీ ఏడిపించారు.ఆ సినిమాకు నేను డబ్బులు తీసుకోలేదు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేసే సమయంలో నా వయసు పదిహేడున్నరేళ్లు.ఆ విషయం చెప్తే ఎవరూ నమ్మలేదు.
సినిమాలు చేస్తే ఏడాదిలో రెండు, మూడు నెలలే పని ఉంటుంది.అదే సీరియల్స్ అయితే ప్రతి నెలా పని ఉంటుంది.
పైగా అక్కడ స్కిన్ షోతో పాటు బెడ్‌రూమ్ సీన్లు చేయమంటారు.అది ఇష్టం లేకే సినిమా ఇండస్ట్రీ వదిలేసి బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయాను.
ఇకపోతే నా ఇల్లును తాకట్టు పెట్టి మరీ బ్యూటీ అండ్ జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించాను.నాకు మంచి అవకాశాలొస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సంతోషి శ్రీకర్.







