టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దేవర సినిమా( Devara Movie ) తెరకెక్కుతుండగా చరణ్ జాన్వీ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కడం నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కు దైవ భక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ తిరుమలకు( Tirumala ) తరచూ వెళుతుంటారు.తాజాగా జాన్వీ కపూర్ తిరుమల టూర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆ వీడియోలో జాన్వీ కపూర్ మోకాళ్ల మిట్ట దగ్గర మోకాళ్లపై మెట్లు ఎక్కారు.దాదాపుగా 50సార్లు తాను ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు.
తిరుమల దేవాలయమంటే నాకు ఎంతో ఇష్టమని జాన్వీ కపూర్ వెల్లడించారు.

రామ్ చరణ్( Ram Charan ) జాన్వీ కపూర్ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు నిన్న గ్రాండ్ గా జరిగాయి.రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.దేవర సినిమాలో జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో కనిపించనున్నారు.
జాన్వీ కపూర్ తిరుమలకు తన స్నేహితులు శిఖర్ పహారియా, ఒరీతో కలిసి వెళ్లడం గమనార్హం.జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇతర భాషలతో పోల్చి చూస్తే తెలుగు భాషకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న జాన్వీ కపూర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలీవుడ్ లో జాన్వీ కపూర్ పలు ప్రాజెక్ట్ లలో నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.