రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ వేరు.ఇతర పార్టీల కంటే ఇందులో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి.
ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం కన్నా కూడా.సొంత పార్టీ నేతల మీదనే ఎక్కువగా విమర్శలు చేస్తూ పరువు తీసుకుంటారు కాంగ్రెస్ నేతలు.
ఇందుకు ఏ ఒక్కరు కూడా అతీతం కాదు.ఇప్పటికే తెలంగాణలో ఈ తరహా రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
దీనిపై అటు ఢిల్లీ పెద్దలు కూడా చాలాసార్లు క్లాసులు తీసుకున్నారు.అయినా సరే నేతల ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు.
అప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది.
జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
కాగా మొన్న పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చ బండ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ తాను కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్తానంటూ చెప్పారు.అయితే అదే జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డికి ఈ విషయం చెప్పకుండా ప్రకటించడమే జగ్గారెడ్డికి మింగుడు పడటం లేదు.
దీంతో ఆయన రేవంత్ తన తీరు మార్చుకోవాలంటూ బహిరంగంగానే చెప్పేశారు.ఒక వేళ ఆయన మారకపోతే సోనియా గాంధీ అయినా చెప్పి మార్చాలంటూ లేఖ రాసిన విషయాన్ని బహిర్గతం చేశారు.

దీంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా కింద జగ్గారెడ్డి పని ఉందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు.జగ్గారెడ్డిని త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తామంటూ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు.కాగా ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు.అలాంటప్పుడు రేవంత్ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.రేవంత్ తనకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాన్ని ప్రకటించడం తప్పు కాదా అని మండిపడుతున్నారు.అంటే లేని పంచాయితీని జగ్గారెడ్డి తెరమీదకు తెస్తున్నారన్నమాట.
ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.