గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదు.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేసిన సినిమాలలో గుంటూరు కారం సినిమా కూడా ఒకటి.ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా మహేష్ అభిమానులలో ఎక్కువమందికి నచ్చలేదు.

 Jagapatibabu Sensational Comments Aboutguntur Kaaram  Details Here Goes Viral In-TeluguStop.com

గుంటూరు కారం సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.తాజాగా జగపతిబాబు ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Guntur Kaaram, Jagapathi Babu, Mahesh Babu, Pushpa, Sreeleelaallu-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )తో కలిసి పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని జగపతిబాబు పేర్కొన్నారు.కానీ గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదని ఈ విషయం నిజాయితీగా చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.గుంటూరు కారం సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాల్సిందని జగపతిబాబు పేర్కొన్నారు.గుంటూరు కారం మూవీలో పాత్రలను మరింత మెరుగ్గా రాసుకోవాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Guntur Kaaram, Jagapathi Babu, Mahesh Babu, Pushpa, Sreeleelaallu-Movie

కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారిపోయిందని జగపతిబాబు వెల్లడించారు.నేను ఆ సినిమా కోసం చేయాల్సింది చేశానని అయితే మహేశ్ తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి సినిమాల కొరకు మా కాంబినేషన్ ను వేస్ట్ చేయాలనిపించదని జగపతిబాబు వెల్లడించడం గమనార్హం.జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

పుష్ప ది రూల్ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమాలో సైతం ఆయన నటిస్తుండటం గమనార్హం.

జగపతిబాబు ప్రస్తుతం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.జగపతిబాబు భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube