గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదు.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేసిన సినిమాలలో గుంటూరు కారం సినిమా కూడా ఒకటి.
ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా మహేష్ అభిమానులలో ఎక్కువమందికి నచ్చలేదు.
గుంటూరు కారం సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.తాజాగా జగపతిబాబు ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
"""/" /
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )తో కలిసి పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని జగపతిబాబు పేర్కొన్నారు.
కానీ గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదని ఈ విషయం నిజాయితీగా చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.
గుంటూరు కారం సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాల్సిందని జగపతిబాబు పేర్కొన్నారు.గుంటూరు కారం మూవీలో పాత్రలను మరింత మెరుగ్గా రాసుకోవాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు.
"""/" /
కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారిపోయిందని జగపతిబాబు వెల్లడించారు.నేను ఆ సినిమా కోసం చేయాల్సింది చేశానని అయితే మహేశ్ తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి సినిమాల కొరకు మా కాంబినేషన్ ను వేస్ట్ చేయాలనిపించదని జగపతిబాబు వెల్లడించడం గమనార్హం.
జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.పుష్ప ది రూల్ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమాలో సైతం ఆయన నటిస్తుండటం గమనార్హం.
జగపతిబాబు ప్రస్తుతం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.జగపతిబాబు భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమా కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్యను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారా.. నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇదే!