జగ్గు భాయ్ అని టాలీవుడ్ ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే జగపతిబాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ హీరో 170 కి పైగా సినిమాల్లో నటించి అలరించాడు.
జగపతిబాబు( Jagapathi Babu ) యాక్షన్, కామెడీ, ఎమోషనల్ ఇలా ఏ క్యారెక్టర్ లోనైనా ఈజీగా దూరిపోగల ప్రతిభావంతుడు.ఈ నటుడు గొప్ప నటనను గుర్తిస్తూ ఏడు స్టేట్ నంది అవార్డులను కూడా అందజేశారు.
గాయం, శుభలగ్నం, అనుకోకుండా ఒక రోజు, మావిచిగురు అంటే ఏ సినిమాల్లో జగపతిబాబు నటన వేరే లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు.వీటన్నింటికంటే అతడు గొప్పగా నటించిన సినిమా అంతఃపురం చెప్పుకోవచ్చు.

కృష్ణవంశీ ( Krishna Vamsi )దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998లో రిలీజ్ అయింది.ఈ మూవీలో జగపతి బాబు చేసిన అప్పటిదాకా చేసిన వాటిని భిన్నంగా ఉంటుంది.ఇందులో జగ్గు భాయ్ సారాయి వీర్రాజు గా కనిపించాడు.క్లైమాక్స్ లో మాత్రం చనిపోతూ సిగరెట్ వెలిగించుకొని బాగా బాధపడిపోతుంటాడు.ఈ సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుంది.కృష్ణవంశీ దీని గురించి జగపతిబాబుకి ఒకసారి ఎక్స్‌ప్లేయిన్ చేయగానే ఒకే టేక్ లో దానిని అద్భుతంగా చేసి వావ్ అనిపించాడు జగపతిబాబు.
రెండో టేక్ చేయాల్సిన అవసరం లేదని, ఇంత ఎమోషనల్ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేసావంటే నువ్వు మామూలు నటుడివి కాదు అని కృష్ణవంశీ అప్పట్లో తెగ పొగిడేసాడట.

జగపతిబాబు క్లైమాక్స్ వరకు సరదా మనిషిగా అనిపిస్తాడు కానీ లాస్ట్ లో అతడు హాల్డ్ చేసిన ఎమోషన్స్ అన్ని ఒకేసారి బయట పెడతాడు.ఆ సన్నివేశాలు చూస్తుంటే ఎవరికైనా సరే ఏడుపు వచ్చేస్తుంది.అలాంటి మోస్ట్ ఎమోషనల్ సీన్లను జగపతిబాబు అలవోకగా సింగిల్ టేక్ లో చేయడం నిజంగా ఆశ్చర్యకరం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప నటుడు ఉండటం తెలుగు వారి అదృష్టమని చెప్పుకోవచ్చు.జగపతిబాబు రంగస్థలం సినిమాలో కూడా టెరిపిక్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు.నటనలో మంచి నైపుణ్యం ఉంది కాబట్టే ఇప్పటికీ ఈ హీరో సినిమాల్లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు.ఇకపోతే ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి అలరించాడు.
ఇప్పుడు పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ మూవీలో జగ్గు భాయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.