జగ్గూ భాయ్ సింప్లిసిటీ.. జనమంతా ఫిదా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కుటుంబ కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే జగపతిబాబు గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి సందడి చేశారు.

మధ్యలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చినప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను హీరోగా కాకుండా విలన్ పాత్రలు చేస్తూ సరైన ఎంట్రీ ఇచ్చారు.హీరో కన్నా విలన్ పాత్రలు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాయని ఓ సందర్భంలో జగపతిబాబు తెలియజేశారు.

ప్రస్తుతం సినిమాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలను పోషిస్తూ కెరియర్ పరంగా జగపతి బాబు ఎంతో బిజీగా అయ్యారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి గర్వం లేకుండా తన సింప్లిసిటీతో అందరి మన్ననలు పొందుతున్నారు.

అదే విధంగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై కూడా జగపతిబాబు స్పందిస్తుంటారు.ఇక ఎప్పుడు కులం మతం అంటూ కులం పేరును చెప్పకుండా అందరితో ఎంతో మర్యాదగా నేర్చుకునే స్వభావం జగపతిబాబుకి సొంతమని చెప్పవచ్చు.

Advertisement

జగపతి బాబు ఒక స్టార్ సెలబ్రిటీ అన్నగర్వం ఏ మాత్రం లేకుండా తన దగ్గర పనిచేసే వారితో కూడా ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారనే ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు గమనించాము.ఇకపోతే తాజాగా జగపతి బాబు ఒక రోడ్ సైడ్ డాబాలో తన అసిస్టెంట్లతో కూర్చుని భోజనం చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి భోజనం చేసామని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు జగ్గు భాయ్ సింప్లిసిటీ కి ఫిదా అయ్యారు.

ఈ క్రమంలోనే కొందరి నెటిజన్లు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా? ఎంతో సింప్లిసిటీని మెయింటేన్ చేస్తున్నారంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు