యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా తన కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతోంది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
గతకొన్నేళ్లుగా పూర్తిగా యాక్షన్ సినిమాలకే పరిమితం అయిన ప్రభాస్ ఈ సినిమాతో పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మన ముందుకు తీసుకొస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు ప్రముఖ నటుడు జగపతి బాబును చిత్ర యూనిట్ సంప్రదించారట.సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర్నండీ జగపతి బాబు క్యారెక్టర్, విలన్ పాత్రలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
కాగా స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్ పాత్రలు వేస్తున్న జగ్గు భాయ్‌ని ప్రభాస్ చిత్రంలో నటించేందుకు చిత్ర యూనిట్ అడిగారట.
అయితే సినిమా కథ తెగ నచ్చేయడంతో జగ్గు భాయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో ప్రేమపావురాలు బ్యూటీ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.







