ఈ రోజు చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు.అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన నిధులను ఆయన విడుదల చేయబోతున్నారు.జగన్( CM Jagan ) నగరి పర్యటన నేపథ్యంలో, ఏపీ మంత్రి ,నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు .వచ్చే ఎన్నికల్లో రోజా( Minister Roja )కు టికెట్డ్ దక్కే ఛాన్స్ లేదనే ప్రచారం జరుగుతుండడం, దీనికి తగ్గట్లుగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా విషయంలో అసంతృప్తిగా ఉండడం, రోజాకు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో కొంతమంది నేత్రలను ప్రోత్సహిస్తూ ఉండడం, వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం వంటి అంశాలతో రోజా గత కొంతకాలంగా ఆందోళనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో నగరిలో ఈ రోజు జగన్ పర్యటనను విజయవంతం చేసి, తన సత్తా చాటుకోవాలని రోజా చూస్తున్నారు.
![Telugu Aganannavidya, Ap Cm Jagan, Ap Roja, Rk Roja, Sathyasai-Politics Telugu Aganannavidya, Ap Cm Jagan, Ap Roja, Rk Roja, Sathyasai-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Roja-ap-minister-Roja-jagananna-vidya-deevena-ap-cm-Jagan-Sathyasai-District.jpg)
ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టి జగన్ దృష్టిలో పడాలని రోజు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు భారీ సంఖ్యలో వైసీపీ నాయకులతో పాటు, జనాలు హాజరయ్యే విధంగా జన సమీకరణ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.నగరి పట్టణ శివారులోని సాయి దివ్య దామంలో జగన్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నగరి పట్టణ సమీపంలోని కీళ్లపట్టు వద్ద హెలిపాడ్ ను సిద్ధం చేశారు.కీళ్ల పట్టు హెలిసాడ్ నుంచి జగన్ రోడ్ షో నిర్వహించి నగరి పట్టణంలోని పల్లిపట్టు రోడ్డు , ప్రకాశం రోడ్డు మీదుగా నగరి బైపాస్ మీదుగా జగన్ రోడ్డు షో ద్వారా బహిరంగ సభకు చేరుకునేలా వైసిపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే జగన్ హెలిపాడ్ నుంచి రోడ్ షో జరిగే రోడ్లు, బహిరంగ సభ జరిగే ప్రాంతం వరకు రోడ్డుకు ఇరువైపు పోలీసులు భారీ ఎత్తున భారీ కేట్లను ఏర్పాటు చేస్తున్నారు.నగరిలో జరగనున్న జగన్ బహిరంగ సభకు వైసిపి కార్యకర్తలు భారీగా తరలివస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు అంచనా వేస్తున్నారు.
ఇక సభకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా దగ్గరుండి రోజా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.కార్యకర్తలకు మంచినీళ్లు, ఆహారపత్రాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో జగన్ పర్యటించబోతున్న నేపథ్యంలో , ఆమె భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
![Telugu Aganannavidya, Ap Cm Jagan, Ap Roja, Rk Roja, Sathyasai-Politics Telugu Aganannavidya, Ap Cm Jagan, Ap Roja, Rk Roja, Sathyasai-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Nagari-constency-RK-Roja-ap-minister-Roja-jagananna-vidya-deevena-ap-cm-Jagan-Sathyasai-District.jpg)
అయితే ఈ సభ ద్వారా రోజా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పార్టీలోని ఆమె వ్యతిరేకవర్గంలో ఏవిధంగా పావులు కదుపుపోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఇక నగరి సభను విజయవంతం చేసేందుకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లా( Sathyasai District )ల నుంచి భారీగా వైసిపి నాయకులు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట.ఇక ఈ సభ ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనే విషయంపై రోజా కూడా కాస్త ఆందోళనలోనే ఉన్నారట.