రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ( Cm jagan )ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు .వచ్చే ఎన్నికల్లో వైసిపి 175 కు 175 స్థానాల్లోనూ విజయం సాధించే విధంగా టార్గెట్ ను పెట్టుకున్నారు.
ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో వైసిపి ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్ళీ తమ పార్టీని గెలిపిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఎన్నికల హామీలను దాదాపుగా అమలు చేసినా, ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నారు .తాజాగా మరో రెండు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.వీటిలో ఒకటి జగనన్న ఆరోగ్య సురక్ష‘ రెండోది ‘ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమం.
ఈ జగనన్న ఆరోగ్య సురక్ష( Jagananna arogya suraksha ) కార్యక్రమంలో ద్వారా ఏం చేయాలి ఎలా చేయాలి అనేదానిపై అందరికీ వివరించార జగన్.ఇటీవల జరిగిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమం గురించి పూర్తిగా వివరించారు.

అలాగే పార్టీ ,ప్రభుత్వం కలిసి నిర్వహించే కార్యక్రమాలను ఏ విధంగా సక్సెస్ చేయాలి అనే విషయం పైన పార్టీ నాయకులకు సూచించారు .తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.రెండు నెలల క్రితం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ద్వారా ప్రజల్లో వైసిపి ప్రభుత్వం మరింత ఆదరణ పెరిగేలా చేయాలని జగన్ సూచించారు.జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు భాగస్వామి అయ్యేవిధంగా వివిధ విధానాలు రూపొందించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ( Jagananna arogya suraksha )ద్వారా ప్రతి గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయనున్నారు.

ప్రతి ఇంటిని, ప్రతి గ్రామాన్ని సందర్శించి ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు( Health problems ) ఉన్నా, వారిని గుర్తించి వైద్య సేవలు అందించమన్నారు .ఈ మేరకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లతో వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.ఏ వ్యాధి ఉన్న పేషెంట్ అయినా, వారికి నయం అయ్యేవరకు పూర్తిగా పర్యవేక్షణ చేయనున్నారు.
మొదటి దశ ఇప్పటికీ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అయింది.ఇక ‘ ఏపీ నీడ్స్ జగన్ ‘ అనే పార్టీ కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు.