ఏపీలో ఎన్నికల సంఘం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.సభలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆయా పార్టీల అధినేతలు పూర్తిగా జనాల్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వివిధ పథకాలు, నిధుల విడుదల పేరుతో ఈ మధ్యకాలంలో తరచుగా జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ ( Uravakonda, Anantapur district )లో జగన్ పర్యటించమన్నారు.
నాలుగో విడత వైస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు.

ఈ మేరకు ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం( Tadepalli Camp Office ) నుంచి బయలుదేరి ఉరవకొండకు జగన్ చేరుకుంటారు.అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.ఈ సందర్భంగా వైస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి అందించనున్నారు .అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించమన్నారు.79 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించనున్నారు దీనికోసం 6394 కోట్ల రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం కేటాయించింది.ఇక ఈ సభ అనంతరం జగన్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.వైఎస్సార్ ఆసరా కార్యక్రమం( YSR Asara Program ) ఈ ఏడాది చివరి కార్యక్రమం కావడంతో, మొత్తం నిధులను జమ చేసినట్లే.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరాగా నిలిచినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైఎస్ షర్మిల ( YS Sharmila )టూర్ ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల సైతం వచ్చే ఎన్నికలన దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరికలను పెద్ద ఎత్తున ఉండేలా చూసుకుంటున్నారు.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.
నిన్న రాత్రి శ్రీకాకుళం చేరుకున్న షర్మిల నేడు ఇచ్చాపురంలో పర్యటిస్తారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.
ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇచ్చాపురం చేరుకుని ప్రజాప్రస్థానం విజయ స్థూపాన్ని షర్మిల సందర్శిస్తారు.ఆ తరువాత స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులతో షర్మిల సమావేశం అవుతారు.
షర్మిల వెంట ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, గిడుగు రుద్దరాజు, సీనియర్ నేతలు కెవిపి రామచంద్రవు తదితరులు పాల్గొనబోతున్నారు.








