తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్.ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీకి రాష్ట్రంలో జవసత్వాలు ఇవ్వడంతోపాటు.
ఇప్పటికే అనేక రోగా లను ఈ జాబితాలోకి తీసుకువచ్చారు.ఇక, ఇంటింటికీ రేషన్ పంపిణీని కూడా అమలు చేశారు.
ఇది కూ డా వైఎస్ ఆచరణలో పెట్టాలని అనుకున్నారు.కానీ, అనుకున్న తర్వాత.
అమలులోకి వచ్చేలోపే.ఆ యన హఠాన్మరణం చెందారు.
ఇక, వైఎస్ జాబితాలో.మరో కీలక ప్రాధాన్య అంశం.
రచ్చబండ.ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని వైఎస్ భావించారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనేక వ్యవస్థలు ఉన్నాయి.అధికారులు ఉన్నారు.మీడియా కూడా ఉంది.అయినప్పటికీ.
ప్రభుత్వం ఎంత చేస్తున్నా.ప్రజల్లో సంతృప్తి ఆశించిన మేరకు లేదని అప్పట్లో వైఎస్ భావించారు.
ముఖ్యంగా కొత్త పార్టీల రాక.నేతల వ్యూహాలు వంటివి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా కూడా మారాయి ఇక, పార్టీలో వర్గ పోరు పెరిగే అవకాశం ఉందని సంకేతాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇలాంటి వన్నీ.తొలిగి పోవాలంటే.
తాను.క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడంతోపాటు.
ప్రజలతో నేరుగా మమేకమైతే.ఎలాంటి ఇబ్బందీ ఉండదనిభావించిన వైఎస్ రచ్చబండకు శ్రీకారం చుట్టారు.

2009, సెప్టెంబరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహణకు బయల్దేరిన.వైఎస్.హఠాత్తుగా మృతి చెందారు.దీంతో ఈ కార్యక్రమం అక్కడితో ఆగిపోయింది.అయితే.ఇప్పుడు ఇదే పేరుతో.
జగన్ కార్యక్రమం నిర్వ హించేందుకు రెడీ అయ్యారు.జగన్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది.
ప్రజలకు చేరువ అవుతున్నాయి.అయితే.
అదేసమయంలో విపక్షాల దూకుడు పెరిగింది.దీనికి కనుక అడ్డుకట్ట వేయకపోతే.
ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రచ్చబడ్డ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి.ఉగాది నాడు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.అప్పటికి.
అన్ని ఎన్నికలు కూడా పూర్తవుతాయి కనుక.ప్రజలకు నేరుగా చేరువ అయితే.
అటు రాజకీయంగా ఇటు పార్టీ పరంగా.ప్రభుత్వ పరంగా కూడా వ్యూహం కలిసి వస్తుందని భావిస్తున్నారు.