విభజన పుణ్యమా అంటూ తీసుకున్న నిర్ణయాలు ఆ రెండు రాష్ట్రాలకు శాపంగా మారాయి.అయితే ప్రస్తుతం సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న ఇబ్బందులు చూస్తే అంతా ఇంతా కావు.
ఖజానాలో చూస్తే పైసా లేదు, మరో పక్క ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు.ఇదిలా ఉంటే గత ఏడు నెలలుగా రెండు రాష్టా మధ్య నడుస్తున్న యుద్దం చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకునే చర్యలకు భారం పడేది మాత్రం ప్రజల మీదనే.
మరి.అలాంటి సందర్భాల్లో ఏపీ ప్రజలకు నష్టం వాటిల్లేలా తెలంగాణ సర్కారు చాలానే నిర్ణయాలు తీసుకుంది.అయినప్పటికి ఇప్పటివరకూ విపక్ష నేతగా వైఎస్ జగన్ తెలంగాణా సర్కారుపై నోరు విప్పలేదు.కనీసం ఈ రకంగా కాకపోయినా తెలంగాణ సర్కారు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ, చిరు ప్రయత్నం సైతం చేయలేదు.
ఇక మరో పక్క చంద్రబాబు సర్కార్ కు మద్దతుగా నిలిచి సీమాంధ్ర భవిష్యత్తుపై ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చెయ్యాల్సింది పోయి జగన్ చంద్రబాబు సర్కారు తీరుపై తాజాగా దీక్ష చేపట్టనున్నాడని తెలుస్తుంది.ఇందుకోసం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జనవరి 31.ఫిబ్రవరి 1 తేదీల్లో ఆయన నిరాహారదీక్షకు నాంది పలకనున్నాడు.మరి ఈ దీక్ష ఏదో సీమాంధ్ర ప్రజలకోసం అటు కేంద్రం పైనా, ఇటు తెలంగాణా పైనా చేస్తే జగన్ కే కాదు ప్రజలకు సైతం ఉపయోగకరం.