జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.ఈ సమావేశానికి కాపు సంక్షేమ సేన తరపున మాజీ మంత్రి హరిరామ జోగయ్య పాల్గొన్నారు.
కాపు రిజర్వేషన్లు, సంక్షేమంతో పాటు మిగిలిన కులాలతో సమన్వయం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.అనంతరం హరిరామ జోగయ్య మాట్లాడుతూ జగన్ పోవాలి.
పవన్ రావాలి అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని తెలిపారు.విపక్షాలు కలవాలని చంద్రబాబు అంటారు కానీ రాజ్యాధికారం తమ చేతుల్లోనే పెట్టాలంటారన్నారు.
జనసేనను బలహీన పరచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.కన్నాను జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు.
వైసీపీ, టీడీపీలపై పవన్ యుద్ధం ప్రకటించాలని సూచించారు.







