లేదు లేదు అంటూనే ఏపీలో ముందస్తు ఎన్నికల జగన్ ( CM jagan )సీరియస్ గానే దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతుంది.గత కొద్ది రోజులుగా జగన్ తో పాటు , వైసిపి కీలక నాయకులు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉంటున్నారు.
నియోజకవర్గల్లో పనితీరు సక్రమంగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను తప్పించబోతున్నామనే సంకేతాలను ముందుగానే ఇస్తున్నారు.దీంతోపాటు సచివాలయం ఉద్యోగుల సెలవులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
అలాగే మెడికల్ లీవులు కావాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇక జిల్లా కలెక్టర్లు వివి పాట్లను తనిఖీ చేయడం మొదలైంది .ఇక నిన్న వైసిపి కోర్ కమిటీ సమావేశాన్ని జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల జాబితా ముందస్తు ఎన్నికల అంశం పైన ప్రధానంగా చర్చి జరిగినట్లు ద్వారా తెలుస్తోంది.
మరో 10 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే విషయమై నిర్ణయం తీసుకోబోతున్నారట.

దీంతో కచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల సమయం కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనతో వైసిపి ఉన్నట్లుగా అర్థమవుతుంది.ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గట్టెక్కాలి అని చూస్తోంది.
అలాగే ప్రతిపక్షాలు బలపడకుండా చూడాలనే ఉద్దేశంతో జగన్ ముందస్తుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.అయితే ఈ విషయంపై ఉపాధ్యాయులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా అనేది తేలాల్సి ఉంది.అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది.
ఒకవైపు టిడిపి( TDP party ) అధినేత చంద్రబాబు, మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ( YCP party ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూ ప్రజలను చర్చ జరిగే విధంగా చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రతిపక్షాలకు మరింతగా అవకాశాలు ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి తమ విజయానికి డోకా లేకుండా చూసుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.
.






