ఉత్తరాంధ్రలో కొత్త వైద్య కళాశాల..!

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం 986 కోట్లతో వైద్య కళాశాల, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.రూ.470 కోట్లతో ఏలేరు, తాండవ కాల్వల అనుసంధాన ప్రాజెక్టు, నర్సీపట్నం వద్ద రూ.52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సీపట్నం హైవేపై రూ.16.60 కోట్లతో రోడ్డు విస్తరణ పనుల శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు.అనంతరం పెద్దఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పుడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు.

 Jagan Lays Foundation For Medical College Narsipatnam Details, Ap Cm Jagan, Jaga-TeluguStop.com

ప్రతీ ఏటా 100 సీట్ల అడ్మిషన్ల తో వస్తున్న కొత్త మెడికల్ కాలేజీ, అదే సామర్థ్యంతో అనుబంధ నర్సింగ్ కాలేజీ కూడా టీడీపీ హయాంలో నోచుకోలేదు అని, ఇప్పుడు ఈ ప్రభుత్వం లోని స్థాపకాలు మాత్రం పరిసర ప్రాంతాల ఆరోగ్య, వైద్య అవసరాలను తీరుస్తుందని అన్నారు.

టీడీపీ హయాంలో వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లే ప్రజలు 630 పడకల ఐపీ (ఇన్‌ పేషెంట్‌) కెపాసిటీ ఉన్న మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తవుతుంది అని మాట ఇచ్చారు.నర్సీపట్నం, దాని పరిసర ప్రాంతాలు అయిన నర్సీపట్నం, పాడేరు, పార్వతీపురం, విజయనగరంలో వైద్య కళాశాలలు పూర్తయితే వైద్యరంగంలో ఎలాంటి అభివృద్ధి,

ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో ప్రజలు కళ్లారా చూస్తారని జగన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.ఏలేరు, తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణంతో తాండవ కాలువ కింద 51465 ఎకరాల ఆయకట్టు శాశ్వతంగా స్థిరీకరించబడుతుందని, ఏలేరు ఎడమ కాలువ కింద 5600 ఎకరాల కొత్త ఆయకట్టు అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.ఈ ప్రాంతంలో త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం కూడా రాబోతోందని ప్రకటించిన ఆయన, అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడం గర్వంగా ఉందని, ప్రజల సహకారం భగవంతుని దయతో భవిష్యత్తులో మరిన్ని ప్రారంభించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube