ఏపీ సీఎం జగన్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.ఎన్నికల కోసం జగన్ ఎంత ఆత్రుత పడుతున్నారో జగన్ ను ఇంటికి పంపడానికి అంతగా ప్రజలు వేచి చూస్తున్నారని తెలిపారు.
బహిరంగ సభల్లో జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.సిగ్గు లేకుండా పవన్, చంద్రబాబులను జగన్ విమర్శిస్తున్నారని చెప్పారు.
అధికారం కోసం జగన్ సొంత కుటుంబ సభ్యులనే మోసం చేశారని ఆరోపించారు.