బీజేపీ పై ఇక యుద్దమే ? డిసైడ్ అయిపోయిన జగన్ ?

ఏపీ విషయంలోనూ, వైసీపీ విషయంలోనూ కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటి నుంచో ప్రజల్లో ఆగ్రహం ఉంది.

ఈ విషయంలో జగన్ పై ఒత్తిడి వస్తూనే ఉంది.

కేంద్రం ఏపీకి ప్రయోజనాలు చేకూర్చకపోయినా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నా, జగన్ మాత్రం లాలూచీ పడుతున్నారని, ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, బీజేపీ దగ్గర అణిగిమణిగి ఉంటున్నారనే విమర్శలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి.అయితే రాను రాను ఈ తరహా రాజకీయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, భవిష్యత్తులోనూ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో జగన్ ఆలోచనలు మార్పు వస్తోందట.

ఆర్థికంగా ప్రస్తుతం ఏపీ పీకల్లోతు కష్టాల్లో ఉంది.ఉద్యోగులకు నెలవారి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది.

అలాగే భారీ ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉంది.వీటన్నిటి పైన కేంద్రం పెద్దగా స్పందించకపోవడం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడం వంటి వ్యవహారాలు జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.

Advertisement

ఇప్పటికే అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం ఉండకపోవడం వంటివి జగన్ ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది.రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలన్నా, ప్రజల్లో చులకన కాకుండా చూసుకోవాలన్నా కేంద్రంతో ఇక తాడోపేడో తేల్చుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట.

ముఖ్యంగా ఏపీ రాజధానులు ,విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లోనూ తమకు ఇబ్బంది కలిగేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తమను తరచుగా ఇబ్బంది పెడుతూ లేఖలు రాయడం చికాకు కలిగిస్తున్నా, తమ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోకపోగా, ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి మరి యోగక్షేమాలు తెలుసుకోవడం, బీజేపీ అండ దండలతో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండడం, ఇలా అనేక అంశాలతో బీజేపీ పై జగన్ వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది.ముందు ముందు బీజేపీతో తలపడేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు