జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని చివరికి ఆయన సొంత జిల్లా పులివెందులలో కూడా ప్రజలు ఆయనతో విసిగిపోయారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) .సాదరణం గా ముఖ్య మంతులు సొంత జిల్లాకు ఏమి చేశారో ఘనంగా చెప్పుకుంటారని, కానీ ఇక్కడ పులివెందుల లో ప్రతిపక్ష నాయకులపై పెట్టిన కేసుల లెక్కలు మాత్రమే ముఖ్యమంత్రి జగన్ చెప్పగలరని ఎందుకంటే కనీసం సొంత జిల్లాలో కూడా రైతులకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని నారా లోకేష్ విమర్శించారు .
ప్రతిపక్షాలపై తర్వాత కక్ష తీర్చుకోవచ్చని ముందు ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వమని లోకేష్ హితవు పలికారు.పులివెందుల, ప్రొద్దుటూరు తెలుగుదేశం ఇన్చార్జిలు బీటెక్ రవి( BTech Ravi Arrest ), ప్రవీణ్ కుమార్ రెడ్డి ల అరెస్టులపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పోలీసుల సహకారం లేకపోతే కనీసం ఈ ప్రభుత్వం మనుగడ కూడా ఉండేది కాదని, సమీక్షలు పెట్టుకుని మరీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్లు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఒకపక్క నా ఎస్సీలు నా ఎస్సీలు అంటూనే రోజుకొక దళితుడిని ప్రభుత్వం హత్య చేయిస్తుందని, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లో పోలీసులు వేధింపులు తాళ లేక మహేంద్ర అనే దళిత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది రాజ్యం చేసిన హత్య గా చూడాలని లోకేష్ వ్యాఖ్యానించారు.పులివెందులలో తెలుగుదేశం బలం పుంజుకుంటుందని, జగన్కు రాజకీయ సమాధి కట్టడం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నాయకులపై రోజుకొక కేసు పెట్టి వేధిస్తున్న జగన్ భవిష్యత్తులో రాజకీయ హీనుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఈ స్థాయిలో ప్రతిపక్షాలపై దాడి చేసిన రాజకీయ నాయకుడు లేడు అని మాజీ మంత్రి సోమిరెడ్డి( Somireddy ) వ్యాఖ్యానించారు.కేవలం ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కోలేకే ఇలా అక్రమ అరెస్టులు చేసి వేధిస్తున్నారని తొందరలోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.