ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో జగన్ పనైపోయిందన్నారు.
దేశంలో రాష్ట్రం పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారని ఆరోపించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
అధికార మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని వెల్లడించారు.