ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడుతుండడంతో ఆమ్ ఆధ్మీ పార్టీ తో సహా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీ లు అన్నీ ఆనందంలో మునిగితేలుతున్నాయి.దేశవ్యాప్తంగా తమకు ఎదురే లేదు అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉండడం, మిగతా ప్రాంతీయ పార్టీలను అణగదొక్కుతూ ముందుకు వెళ్తుండడం ఇవన్నీ బీజేపీపై ప్రాంతీయ పార్టీలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై ఆ పార్టీ కూర్చునే అవకాశం కోల్పోవడం నిజంగా బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే.అందుకే ఇప్పుడు ఇంతగా ఆనందంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
అదీకాకుండా ఈ ఏప్రియల్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించుకోవాలని ఆలోచనలో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు నిరాశ కలిగిస్తున్నాయి.
రాజ్యసభలో బిజెపి మెజార్టీ సాధించకపోవడం వల్ల తమకు ఎక్కువ లాభం చేకూరుతుందని, ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా తమ మద్దతుపై బిజెపి ఆధారపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, జెడియు బిజెడి ఆర్జెడి వంటి ప్రాంతీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
బిజెపికి రాజ్యసభలో మెజార్టీ దక్కకూడదని ఈ పార్టీలు ముందు నుంచి కోరుకుంటున్నాయి.ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఘోరంగా ఉండడంతో ఈ ప్రాంతీయ పార్టీలు చాలా ఆనందంగా ఉన్నాయి.
ముఖ్యంగా రాజ్యసభలో మెజార్టీ కోసం బీజేపీ ఆధారపడుతున్న వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ పార్టీలకు కేజ్రీవాల్ విజయం ఆనందాన్ని నింపుతోంది.

రాజ్యసభలో బీజేపీ కి మెజారిటీ దక్కకపోతే ప్రాంతీయ పార్టీలు అధికారం చెలాయిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక వనరుల విషయంలో బీజేపీ అనుకూలంగా ఉంటుందని, లేకపోతే ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే విధంగా బిజెపి మరింతగా చెలరేగిపోయి ఉండేదని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.ఢిల్లీ లో ఆ పార్టీ గెలుపు ద్వారా బీజేపీ దూకుడుకు కళ్లెం పడింది అని ఈ పార్టీలన్నీ భావిస్తున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది.
అదే సమయంలో అన్నాడీఎంకేతో పాటు బిజెపి పార్టీలు కూడా అసెంబ్లీ స్థానాల ఆధారంగా ఎంపీ సీట్లు గెలుచుకుని రాజ్యసభలో బలపడే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తప్పనిసరిగా గెలిచి తీరాలని భావించింది.దీని కోసం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సైతం రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం చేయించింది.అయినా ఫలితాల నిరాశపరిచాయి.
ఢిల్లీ పరిణామాలు తమకు చాలా మేలు చేశాయని ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా ఆనందంగా ఉంది.ఇదే సమయంలో విభజన హామీల తో పాటు ప్రత్యేక హోదా విషయాన్ని గట్టిగా బీజేపీ నిలదీసి సాధించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వైసిపి భావిస్తోంది.
.






