మెగా బ్రదర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న ఆర్పీ.. ఫ్యాన్స్ షాకయ్యేలా?

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ కమెడియన్లు ప్రస్తుతం ఇతర టీవీ షోలతో బిజీ అవుతున్నారు.

 Jabardasth Rp Tattoo On Heart About Mega Brother Nagababu Name Details, Jabardas-TeluguStop.com

నాగబాబు జబర్దస్త్ షోకు దూరమైన తర్వాత నాగబాబుపై ఉన్న అభిమానంతో పాటు ఇతర టీవీ షోల నుంచి జబర్దస్త్ ను మించి రెమ్యునరేషన్ ఆఫర్లు వస్తుండటంతో చాలామంది కమెడియన్లు ఇప్పటికే ఈ షోకు దూరమయ్యారు.

స్టార్ మా ఛానల్ లో కొన్నిరోజుల క్రితం వరకు కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ప్రసారం కాగా ఆ ప్రోగ్రామ్ కు బదులుగా ప్రస్తుతం మా సూపర్ సండేస్ పేరుతో ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.

తాజాగా రిలీజైన ప్రోమోలో అప్పారావు పార్టీ అంటే ఏ గోవాకో బ్యాంకాక్ కో వెళ్లాలని చెప్పగా ధనరాజ్ మనం బ్యాంకాక్ కు వెళ్లాలన్నా గోవాకు వెళ్లాలన్నా మనకో గైడ్ కావాలని చెబుతారు.ఆ తర్వాత ఈ షోలోకి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చారు.

కేజీఎఫ్2 సినిమాలోని తుఫాన్ సాంగ్ తో సుధీర్ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

ధనరాజ్ సుధీర్ తో నీకొక ట్రావెల్ ఏజెన్సీ ఉందని చెప్పారని అడగగా సుధీర్ ట్రావెల్ ఏజెన్సీ ఉందని ఆ ఏజెన్సీ పేరు హూ.కానీ అని చెప్పారు.ఆ పేరు ఎందుకు పెట్టావని ధనరాజ్ అడగగా మన ట్రావెల్ ఏజెన్సీకి ఎండింగ్ ఉండదని అందుకే ఆ పేరు పెట్టానని తెలిపారు.

ఈ షోలో అనసూయ కూడా సాంగ్ కు స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు.

సుధీర్ నాగబాబుకు వెల్కమ్ చెప్పగా ఎవరు ఎవరికి వెల్కమ్ చెబుతున్నారని నాగబాబు ప్రశ్నించారు.ఆ తర్వాత ఆర్పీ నాగబాబు పేరును తన హార్ట్ పై పచ్చబొట్టు వేయించుకోగా ఆ పచ్చబొట్టును సుధీర్ నాగబాబుకు చూపించారు.ఈ విషయం తెలిసి నాగబాబు సైతం షాకయ్యారు.

నాగబాబు ఆర్పీని పిలిచి ప్రేమగా హగ్ ఇచ్చారు.మనందరం నాగబాబు గారి నవ్వు నుంచి పుట్టిన వాళ్లమని ఆర్పీ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube