బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అతి తక్కువ సమయంలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.జబర్దస్త్ కు ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన అవినాష్.
అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి సెలబ్రేట్ హోదాను సొంతం చేసుకున్నాడు.
జబర్దస్త్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న అవినాష్ వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.
ఇక బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కు దూరమైన అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో మరింత పరిచయాలు పెంచుకున్నాడు.
కానీ కొన్ని విమర్శల వల్ల షో నుండి తక్కువ సమయంలో బయటకు వచ్చాడు.
ఇక బిగ్ బాస్ తరువాత అవినాష్ మళ్లీ జబర్దస్త్ లోకి అడుగు పెట్టలేదు.
కానీ ఆయన కోసం జబర్దస్త్ ప్రేక్షకులు తెగ ఎదురు చూసారని చెప్పాలి.అలా జబర్దస్త్ లో కాకుండా మిగతా షో లలో పాల్గొని బాగా సందడి చేశాడు.
అంతేకాకుండా ఆయన అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.పెళ్లి తర్వాత అవినాష్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.

తన భార్య అనూజను బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాడు.తన భార్యతో కలిసి స్టార్ మా లో ఇస్మార్ట్ జోడి షోలో పాల్గొని బాగా సందడి చేసిన సంగతి తెలిసిందే.అవినాష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారాడు.తన భార్య అనూజతో కలిసి సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాడు.ఇద్దరు కలిసి ఫన్నీ వీడియోలను చేస్తూ తన ఫాలోవర్స్ తో బాగా పంచుకుంటున్నారు.
నిజానికి అనూజకు తన భర్త అవినాష్ వల్ల మంచి ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు.
తాను కూడా ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.తన భర్తతో కలిసి తను చేసే వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు తన భర్త అవినాష్ కే రివర్స్ పంచులు వేస్తూ ఉంటుంది.వీరిద్దరు కలిసి తమ పేర్ల మీద యూట్యూబ్ లో ఓ అకౌంట్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు.

అందులో తమ హోమ్ టూర్ వీడియోలను, ఫన్నీ వీడియో లను, షాపింగ్ వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటారు.ఇక అవినాష్ ఆ వీడియోలలో తెగ ఫన్నీ డైలాగులు కొడుతూ నవ్విస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే తాజాగా యూట్యూబ్ లో మరో వీడియోను షేర్ చేసుకున్నారు ఈ జంట.అందులో తాము షాపింగ్ కోసం వెళ్తున్నామని తెలిపారు.
ఇక మధ్యలో అవినాష్ తన భార్య పరువు తీసేసాడు.పెళ్లికి ముందే కడుపు నిండా తిన్నాను అంటూ ఇప్పుడు మాత్రం తినటం లేదు అన్నట్లు చెప్పాడు.అంటే తన భార్య తనకు వంట సరిగ్గా వండి పెట్టడం లేదని నేరుగా అనడంతో.వెంటనే తన భార్య అనూజ రేపటి నుంచి నువ్వే వండుకో అని కౌంటర్ వేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.







